Akkineni Family: ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి ఫ్యామిలీలలో అక్కినేని ఫ్యామిలీ ఒకటి.ఈ ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వారికంటూ ఓ గుర్తింపు సంపాదించుకోవడం కోసం పెద్ద ఎత్తున కష్టపడుతున్నారు. ఇక అక్కినేని వారసుల సినీ కెరియర్ గురించి పక్కన పెడితే వీరి వ్యక్తిగత విషయానికి వస్తే అక్కినేని కుటుంబంలో ఎక్కువగా విడాకుల కథనాలు మనకు వినపడుతుంటాయి.

నాగార్జున మొదట దగ్గుబాటి లక్ష్మీని పెళ్లి చేసుకొని తనకు విడాకులు ఇచ్చి తిరిగి నటి అమలను పెళ్లి చేసుకున్నారు. అయితే ఈయన పెద్ద కుమారుడు నాగచైతన్య కూడా సమంతను పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చారు. చిన్న కుమారుడు అఖిల్ నిశ్చితార్థం జరుపుకొని బ్రేకప్ చెప్పుకున్నారు.ఇక అల్లుడు సుమంత్ సైతం కీర్తి రెడ్డిని పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉన్నారు. ఇక మేనకోడలు సుప్రియ కూడా తన భర్తకు విడాకులు ఇచ్చి ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియో బాధ్యతలను చూసుకుంటున్నారు.
ఇలా అక్కినేని ఫ్యామిలీలో విడాకులు తీసుకున్నటువంటి వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. అయితే వీరి విషయంలో నాగార్జున స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారని తెలుస్తోంది నెలల వ్యవధిలోనే అక్కినేని కుటుంబంలో వరుసగా మూడు పెళ్లిళ్లు జరగబోతున్నాయని వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇప్పటికే విడాకులు ఇచ్చిన తన పెద్ద కుమారుడు నాగచైతన్య తనకు నచ్చిన అమ్మాయితో పెళ్లి చేయడానికి నాగార్జున సిద్ధంగా ఉన్నారని సమాచారం.

Akkineni Family:మూడు పెళ్లిళ్లు చేయాలని నిర్ణయించుకున్న నాగ్…
ఇక అఖిల్ కిసైతం విజయవాడకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడితో పెళ్లి చేయడానికి నాగార్జున అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. ఇక మేనకోడలు సుప్రియ నటుడు అడవి శేష్ తో రిలేషన్ లో ఉన్నారనీ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఈ ఏడాదిలోనే ఈ ముగ్గురు పెళ్లిళ్లు చేయాలని నాగార్జున నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.































