టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకున్న సమంత అక్కినేని ఏప్రిల్ 28న తన 34 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నది. ఈ క్రమంలోనే ఆమెకి అభిమానులు పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఏ మాయ చేసావే సినిమాలో ఎంతో అమాయకంగా జెస్సీ పాత్రలో నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న తరువాత అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకొని తెలుగింటి కోడలుగా అడుగుపెట్టింది.

పెళ్లి కాక ముందు వరుస సినిమాలతో దూసుకుపోతున్న సమంతా పెళ్లయిన తర్వాత తన స్పీడ్ కి బ్రేక్ పడుతుందని ఎంతో మంది భావించారు. కానీ పెళ్లి అయిన తరువాత సమంత రెట్టింపు వేగంతో దూసుకు పోతూ మరింత గుర్తింపును సంపాదించుకుంది. పెళ్లయిన తర్వాత గ్లామరస్ పాత్రలు కాకుండా ఎంతో అద్భుతంగా నటించే అవకాశాలను పొందుతున్నారు. కేవలం వెండి తెరపై మాత్రమే కాకుండా బుల్లితెర పై బిగ్ బాస్ కార్యక్రమానికి కొన్ని రోజులు వ్యాఖ్యాతగా వ్యవహరించి తనలో ఉన్న నైపుణ్యాన్ని బయటపెట్టింది.
అదేవిధంగా ఓటీటీ ప్లాట్ ఫామ్ వేదికగా ఆహా యాప్ ద్వారా ప్రసారమైన “సామ్ జామ్”షో కి వ్యాఖ్యాతగా వ్యవహరించి తన మార్క్ ఏంటో నిరూపించుకున్నారు. ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లో నటిస్తూ, గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “శాకుంతలం”అనే పౌరాణిక సినిమాలో నటిస్తున్నారు. వృత్తిపరంగా కెరియర్ పరంగా మంచి గుర్తింపును సంపాదించుకున్న సమంత మంచి మనసున్న అమ్మాయిగా కూడా గుర్తింపు పొందింది.
ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది అనాధ పిల్లలను ఆదుకొని వారికి విద్య వైద్యం అందిస్తూ ఎంతో గొప్ప మనసున్న అమ్మాయిగా గుర్తింపు సంపాదించుకుంది. ఇవేకాక బిజినెస్ రంగం వైపు అడుగులు వేస్తూ తన సత్తా ఏంటో నిరూపించుకుంది.’సాకీ’ పేరుతో మహిళల ఫ్యాషన్ దుస్తులను అందుబాటులోకి తెస్తూ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసింది. ఈ వ్యాపారం తన బిడ్డ లాంటిదని సమంత చెప్పడం విశేషం.ఈ విధంగా వివిధ రంగాలలో ఎంతో చురుకుగా పాల్గొంటూ మంచి గుర్తింపును సాధించుకున్న అక్కినేని సమంత ఎప్పుడు స్టార్ హీరోయిన్ అని చెప్పవచ్చు
































