Alekhya Reddy: నందమూరి వారసుడు నందమూరి తారక రత్న ఇటీవల మృతి చెందిన సంగతి అందరికీ తెలిసిందే. రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న తారకరత్న టిడిపి తరఫున పోటీ చేయటానికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో నారా లోకేష్ ప్రారంభించిన పాదయాత్రకి మద్దతుగా యువగళం పాదయాత్రలో పాల్గొని మొదటి రోజే గుండెపోటుతో అస్వస్థతకు గురయ్యాడు. ఆ తర్వాత దాదాపు 23 రోజుల పాటు బెంగుళూరులో చికిత్స తీసుకుంటూ ప్రాణాలతో పోరాడిన తారకరత్న చివరికి తుది శ్వాస విడిచాడు.

తారకరత్న మరణం ఆయన భార్య ఆలేఖ రెడ్డికి తీరని లోటుని మిగిల్చింది. తారకరత్న మరణంతో అలేఖ్యరెడ్డి జీవితం శూన్యంలో మారిపోయింది. ప్రేమించి పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్న వీరిద్దరిని ఇరు కుటుంబాలు దూరం పెట్టాయి. ఈ క్రమంలో అందరి ప్రేమాభిమానాలకు దూరమైన వీరిద్దరూ ఒకరికి ఒకరు ప్రాణంగా జీవించారు. అయితే తారకరత్న హఠాత్మరణంతో అలేఖ్య రెడ్డి జీవితంలో శూన్యం మిగిలింది.
తారకరత్న ఈ లోకంలో లేడనే విషయాన్ని ఇప్పటికి జీర్ణించుకోలేకపోతోంది . ఈ క్రమంలో తరచూ తారకరత్ననే తలుచుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా అలేఖ్య రెడ్డి షేర్ చేసిన ఒక పోస్ట్ అందరిని దిగ్భ్రాంతికి గురిచేసింది. తారకరత్నని తలుచుకుంటూ భర్త మీద తనకి ఉన్న ప్రేమని అలేఖ్య తెలియజేస్తూ పోస్ట్ షేర్ చేసింది.

Alekhya Reddy: ఈ జన్మకు నా జీవితం ఇంతే…
ఈ క్రమంలో ” ఈ జన్మకు నువ్వే నా ప్రపంచం..నా జీవితం అంతా నీ జ్ఞాపకాలతో బ్రతికేస్తా…నా శ్వాస ఉన్నంత వరకు కూడా నిన్నే ప్రేమిస్తుంటాను ” అని అలేఖ్యా రెడ్డి ఎమోషనల్ పోస్ట్ చేస్తూ తారకరత్న తో కలిసి ఉన్న ఒక ఫోటోని షేర్ చేసింది. ప్రస్తుతం అలేఖ్య రెడ్డి షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తారకరత్నని తలచుకుంటూ ఆయన అభిమానులు బాధపడుతున్నారు. అంతే కాకుండా అలేఖ్య రెడ్డికి కూడా ధైర్యం చెబుతున్నారు.































