Allu Aravind: తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అరవింద్ తాజాగా బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి అతిథిగా వచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఈయన సమాధానం చెప్పకు వచ్చారు.

ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో నెపోటిజం ఉందంటూ పలువురు సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. నెపోటిజంపై మీ అభిప్రాయం ఏంటి అని బాలకృష్ణ అడగడంతో అల్లు అరవింద్ నేపోటిజం అంటూ మాట్లాడే వారికి తనదైన స్టైల్ లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. నెపోటిజం అంటూ మాట్లాడేవారు గుండెల పై చెయ్యి వేసుకుని చెప్పండి మీకు కనుక ఇలాంటి అవకాశం వస్తే వదులుకుంటారా అని ప్రశ్నించారు.

Allu Aravind:ఇలాంటి అవకాశం మీకు వస్తే వదులుకుంటారా…
చిన్నప్పటినుంచి సినిమా వాతావరణంలో పుట్టి పెరిగిన వాళ్ళకి సినిమాలపై మక్కువ ఉంటుంది.పిల్లలలో ఆ టాలెంట్ ఉన్నప్పుడు తల్లిదండ్రులు కూడా వారిని అదే మార్గంలోకి వెళ్ళమని చెబితే తప్పేంటి? ఇప్పుడు ఒక డాక్టర్ ఇంజనీర్ లాయర్ వారి పిల్లలను కూడా ఆ వృత్తిలోకి పంపించలేదా మరి దానిని ఏమంటారు? అది నెపోటిజం కాదా ? అంటూ నెపోటిజం గురించి అల్లు అరవింద్ తనదైన స్టైల్ లో సమాధానం చెప్పారు. ప్రస్తుతం అల్లు అరవింద్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
































