Allu Arjun : మామూలుగానే తమ అభిమాన సెలబ్రిటీల పర్సనల్ విషయాలు గురించి అభిమానులు ఎంతో ఆసక్తికరంగా గమనిస్తుంటారు. వారి పెళ్లి, పిల్లలు కుటుంబానికి సంబంధించిన ఫోటోలు, ట్రిప్పుల హడావిడి ఇలా ఒకటేమిటి ప్రతి చిన్న విషయం వీరికి ఆనందాన్ని కలిగిస్తుంది. చిన్నచిన్న సెలబ్రిటీల విషయంలోనే ఫ్యాన్స్ ఇంత ఆనందపడి పోతే ఇంక మన తెలుగు సూపర్ స్టార్ అయిన ఎన్టీఆర్, మహేష్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి హీరో లకు సంబంధించిన విషయాలు అయితే అభిమానుల ఆనందలకు హద్దులు వుండవు.

ప్రస్తుతం అల్లు అర్జున్ కి సంబందించిన ఇలాంటి ఒక వార్తనే అల్లు అర్జున్ వాళ్ళ మావయ్య చంద్రశేఖర్రెడ్డి ఒక ఇంటర్వ్యూలో అభిమానులకు తెలియజేశారు. అల్లు అర్జున్, స్నేహారెడ్డిలు లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయం అందరికి తెలిసిందే . 2011లో అల్లు అర్జున్ , స్నేహల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. దాదాపు 11 ఏళ్లుగా బన్నీ – స్నేహల వివాహ బంధం ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. అయితే.. తాజాగా స్నేహారెడ్డి గారి తండ్రి అయిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ , స్నేహాల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
అల్లు అర్జున్ కట్నం గురించి చెప్పిన మావయ్య…..

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు కూతురు స్నేహ రెడ్డి అల్లు అర్జున్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలోనే పెళ్లి సమయంలో అల్లు అర్జున్ తీసుకున్న కట్నం కానుకలు గురించి ప్రస్తావించగా ఆయన అసలు కట్నం తీసుకోలేదని వారి కుటుంబం మొత్తం కట్నం తీసుకోవడం అనే ఆలోచనకు విరుద్ధంగా ఉంటారని ఆయన తెలియజేశారు. అంతే కాకుండా అల్లు అర్జున్ కుటుంబానికి ఎక్కువగా విలువ ఇస్తారని ఆయన తెలియజేశారు. అల్లు అర్జున్ వాళ్ళ మావయ్య చెప్పిన ఈ విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.































