Allu arjun buys new luxery car and he named the car as beast : గంగోత్రి సినిమాతో హీరో గా తెలుగు చలన చిత్ర రంగ ప్రవేశం చేసిన అల్లు అర్జున్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆర్య, దేశముదురు, రేసుగుర్రం, సరైనోడు, అలా వైకుంఠపురంలో వంటి సినిమాలతో బ్లాక్ బాస్టర్ హిట్లు పొందాడు. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ గా ఎదిగాడు అల్లు అర్జున్. ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ఘన విజయం సాధించి ఐకానిక్ స్టార్ గా మారిపోయాడు.

ఇక మన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ పేరుకే కాకుండా తన రియల్ లైఫ్ లో కూడా ప్రతిదీ స్టైలిష్ గానే ఉండేలా చూసుకుంటున్నాడు. ఇటీవల అల్లు అర్జున్ ఒక విలాసవంతమైన ఇల్లు కట్టించుకున్నాడు, ఇక ఆ ఇల్లు కూడా చాలా లగ్జరియస్ గా స్టైలిష్ గా వుంది . ఇపుడు అందరి చూపు బన్నీ వైపే వుంది. అంతేకాకుండా సుమారు ఏడు కోట్లతో ఫాల్కన్ కారవాన్ ప్రత్యేకంగా చేయించుకున్నాడు. స్టైలిష్ కారవాన్ అపుడు నెట్టింట్లో సందడి తెగ సందడి చేసింది.
కొత్త లగ్జరీ కారు కొన్న అల్లు అర్జున్…..
బడా నిర్మాత అయిన అల్లు అరవింద్ కొడుకుగా నే కాకుండా స్టార్ హీరోగా బాగా సంపాదిస్తున్న అల్లు అర్జున్.. బ్రాండెడ్ వాచ్ లు,కార్లు,డ్రెస్సులు ఇలా అన్నీ స్టైలిష్ ఇంకా లగ్జరీ గా ఉండేలా చూసుకుంటాడు. తాజాగా కారును కొన్నాడు అల్లు అర్జున్.మా ఇంట్లోకి కొత్త కారు వచ్చింది. దానికి నేను ‘బీస్ట్’ అని పేరు పెట్టా. నేను ఏ వస్తువు కొన్నా దానిలో చూసేది కృతజ్ఞతనే’ అని ట్విట్టర్‌లో తన కొత్త కారుని షేర్ చేశారు స్టైలిష్ స్టార్ బన్నీ. అయితే ఈ కారు లో బన్నీ షికార్లు చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.































