Allu Arjun: వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తలలో నిజం లేదంటే వీరిద్దరూ తమ ప్రేమ విషయాన్ని దాచి పెట్టే ప్రయత్నం చేశారు.అయితే చివరికి వీరిద్దరూ తమ ప్రేమ గురించి ఓపెన్ అవుతూ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు.ఈ క్రమంలోనే జూన్ 9వ తేదీ లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరిగింది.

ఇలా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ ఇదివరకే వార్తలు వచ్చిన విషయం మనకు తెలిసిందే అయితే వీరిద్దరి ప్రేమ విషయాన్ని అల్లు అరవింద్ ముందుగానే పసిగట్టారంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అల్లు అర్జున్ నిర్మాణంలో లావణ్య త్రిపాఠి హీరో కార్తికేయతో కలిసి చావు కబురు చల్లగా అనే సినిమాలో నటించారు.
ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలో భాగంగా లావణ్య త్రిపాటి తెలుగులో వేదికపై చాలా స్పష్టంగా మాట్లాడుతుంది.ఈ విధంగా లావణ్య త్రిపాఠి మాట్లాడుతున్న సమయంలో అల్లు అరవింద్ తన చేతిలో మైక్ లాక్కుని ఎక్కడో నార్త్ లో పుట్టిన నువ్వు ఇలా స్పష్టంగా తెలుగు మాట్లాడుతున్నావు ఇక్కడే ఒక తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపో అంటూ కామెంట్స్ చేశారు. ఈ వీడియోని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అల్లు అరవింద్ చాలా టాలెంటెడ్ అని, వీరు ప్రేమ విషయాన్ని ముందుగానే పసిగట్టారంటూ కామెంట్ చేస్తున్నారు.

Allu Arjun:ముందు చూపు ఎక్కువ….
ఇక మరికొందరైతే ఎవరో ఒకరిని చూసుకోమంటే మీ ఫ్యామిలీలో అబ్బాయిని చూసుకుంది అంటూ ఈ వీడియో పై ఫన్నీ కామెంట్ చేయగా అల్లు అర్జున్ సైతం ఈ వీడియో పై రియాక్ట్ అయ్యారు.ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఈ వీడియోని ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేస్తూ మా నాన్నకు చాలా ముందుచూపు ఎక్కువ అంటూ ఫన్నీగా కామెంట్ చేయడంతో ఇది కాస్త మరింత వైరల్ అవుతుంది.
Bunny anna Insta story ????????@Itslavanya #VarunLav #varunlavanyaengagement pic.twitter.com/SMBjzFWI8W
— Bunny_boy_private (@Bunnyboiprivate) June 10, 2023






























