Allu Arjun: అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన వేణు స్వామి?

0
36

Allu Arjun: అల్లు అర్జున్ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన సుకుమార్ దర్శకత్వంలో నటించిన పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు.ఇలా ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమా కూడా భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది.

ఇలా పుష్ప సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం నిర్మించే పనుల్లో దర్శకనిర్మాతలు ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ పోస్టర్ చూస్తుంటేనే సినిమా పై భారీ అంచనాలు పెరుగుతున్నాయి.

ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అంటూ పాన్ ఇండియా స్థాయిలో అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలోని ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఈ సినిమా గురించి చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా వేణు స్వామి మాట్లాడుతూ… అల్లు అర్జున్ నటించిన పుష్ప 2సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంటుందని తెలిపారు.


Allu Arjun: పుష్ప2 బ్లాక్ బస్టర్…

ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ కు మరింత పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అంటూ వేణు స్వామి చేసినటువంటి కామెంట్స్ సంచలనంగా మారాయి. ఇలా వేణు స్వామి పుష్ప 2సినిమాల గురించి చేసిన ఈ కామెంట్స్ విన్నటువంటి బన్నీ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత ఇంటర్వ్యూలో భాగంగా ఈయన అల్లు అర్జున్ సినీ కెరియర్ గురించి మాట్లాడుతూ పది సంవత్సరాలపాటు అల్లు అర్జున్ కెరీర్ పరంగా ఎలాంటి ఢోకా లేదు అంటూ తెలియచేసిన సంగతి మనకు తెలిసిందే.