ఒక వైపు మెగా హీరో ప్రమాదానికి గురై ఇబ్బందుల్లో ఉంటే.. ఓ వైపు అల్లు అర్జున్ సీటీమార్ సినిమాను వీక్షించేందుకు వెళ్లి.. నెటిజన్లకు ఆగ్రహం తెప్పిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ఫ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపు 80 శాతం వరకు సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా.. కాకినాడలో మిగతా షూటింగ్ లో పాల్గొనేందుకు అల్లుఅర్జున్ అక్కడికి వెళ్లారు.

శనివారం ఉదయం అల్లు అర్జున్ టీం కాకినాడకు చేరుకోగా.. రెండు రోజుల పాటు కాకినాడ పోర్ట్ లోపల షూటింగ్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. షూటింగ్ చేస్తున్న సమయంలో ఖాళీ టైంలో అతడు గోపీచంద్ నటించిన ‘సీటీమార్’ సినిమా చూసేందుకు అల్లు అర్జున్ వెళ్లారు. దీంతో ఆ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

గోపీ చంద్, తమన్నా హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా సీటీమార్ సినిమాకు అల్లు అర్జున్ కాకినాడలోని పద్మప్రియ థియేటర్ లో మ్యాట్నీ షో చూశారు. సిటీమార్ అనే పదం.. అల్లు అర్జున్ నటించిన ఓ సినిమాలో వచ్చిన విషయం తెలిసిందే. ఇదంతా ఇలా ఉండగా.. అల్లు అర్జున్ ఇలా సినిమా షూటింగ్ లు పాల్గొంటూ.. సినిమాలు చూస్తుండగా.. నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకంటే..సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ అయి హాస్పిటల్‌లో ఉండగా.. ఇప్పటి వరకు ఎక్కడా స్పందించని బన్నీ.. ఇప్పుడు సీటీమార్ సినిమా థియేటర్‌లో కనపడటంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. బన్నీపై మెగా అభిమానులు కూడా ఆగ్రహంతో ఉన్నారు.































