నటి అమల తెలుగు స్టార్ హీరో అక్కినేని నాగార్జునను రెండో వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.అప్పట్లో నాగార్జున అమలను పెళ్లి చేసుకోవడంతో సినిమా ఇండస్ట్రీతో పాటు,ఆయన అభిమానులు కూడా ఎంతో ఆశ్చర్యపోయారు. నాగార్జున తెలుగుహీరోగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు అలాంటిది ఒక తెలుగు హీరో వేరే భాష అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అదే మొదటిసారి కావడంతో అప్పట్లో నాగార్జున పెళ్లి ఒక సంచలనం అని చెప్పవచ్చు.

అప్పటికి నాగార్జున నిర్మాత రామానాయుడు కుమార్తె లక్ష్మిని వివాహం చేసుకున్నారు. కొన్ని అభిప్రాయ భేదాల కారణంగా వీరిద్దరూ విడాకులు తీసుకోవడంతో 1992 వ సంవత్సరంలో నాగార్జున అమలను వివాహం చేసుకున్నారు. అమల నాగార్జునతో కలిసి తెలుగులో నటించిన మొట్టమొదటి చిత్రం “కిరాయి దాదా”. అమలకు తెలుగులో మొదటి చిత్రం కూడా ఇదే.అయితే అప్పటికే తమిళంలో సుమారు పదిహేను సినిమాల వరకు నటించింది. అదే విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటించిన అమలకు ఇండస్ట్రీలోకి రావాలనే ఆలోచన లేదని ఓ సందర్భంలో తెలియజేశారు.

అమల తల్లి ఐరిష్ అమ్మాయి కాగా, తండ్రి బెంగాలీ వ్యక్తి. ఈ క్రమంలోనే అమ్మాయిలకు ప్రఖ్యాత నాట్యకారుడు ఉదయ్ శంకర్ భార్య పేరు అమల. ఆ పేరే ఆమెకు పెట్టారు. ఈ క్రమంలోనే అమలకి కూడా చిన్నప్పటి నుంచి నాట్యం అంటే ఎంతో ఇష్ట పడుతూ నాట్యం నేర్చుకుంది. ఒకవైపు నాట్యం నేర్చుకుంటూనే మరోవైపు తన చదువును కొనసాగించడం కోసం అమల తల్లిదండ్రులు ఆమెను కళాక్షేత్రలో చేర్పించారు.

ఈ కళాక్షేత్ర తరఫున అమల మన దేశంలో ఉన్న ప్రధాన నగరాల అన్నింటిలో కూడా ఈమె నాట్య ప్రదర్శన చేశారు. మన దేశంలో మాత్రమే కాకుండా పాశ్చాత్య దేశాలలో కూడా ఈ నాట్య ప్రదర్శన చేశారు. ఈ విధంగా డాన్సర్ గా మంచి పేరు తెచ్చుకున్న అమలను రాజేందర్ అనే డైరెక్టర్ ఆమె నాట్య ప్రతిభను చూసి ఆమెకు మొట్టమొదటిగా సినిమాల్లో అవకాశాలు కల్పించారు. ఈ విధంగా అమల అనుకోకుండా సినిమాలలోకి వచ్చి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత తెలుగులో నాగార్జునతో కలిసి సినిమాలలో నటించి నాగార్జునను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.































