అమలాపాల్ మలయాళీ అమ్మాయి అయిన తెలుగులో కూడా మంచి నటన కనబరిచిన ఈ మలయాళీ కుట్టి ఇపుడు పర్సనల్ లైఫ్ లో ఇబ్బందులను ఎదుర్కొంటుంది. అన్ని ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ఈ అమ్మడు. తెలుగులో తక్కువ సినిమాలే చేసినా తన నటనకి మంచి మార్కులు పడ్డాయని చెప్పొచ్చు. అమలాపాల్ నీల తామర అనే మలయాళీ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తరవాత కోలివుడ్, టాలీవుడ్ లో ఎంటరై వరస అవకాశాలతో బిజీగా మారిపోయింది. తెలుగులో నాగ చైతన్య తో బెజవాడ అనే సినిమాతో మొదలైన కెరీర్ “నాయక్” , “ఇద్దరమ్మాయిలతో”, “జెండాపై కపిరాజు” వంటి చిత్రాలలో నటించినా అవి అంతా సక్సెస్ ని ఇవ్వలేదు.
అయితే తమిళంలో మాత్రం అమ్మడు యమా బిజీ అయిపోయింది. అలా సినిమాలతో బిజీగా గా గడుపుతున్న రోజుల్లోనే తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ తో ప్రేమలో ఉందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకోవడం జరిగింది. 4 సంవత్సరాలు సాఫీగా సాగుతున్న వివాహ బంధం ఒక్కసారిగా విడాకుల దాకా వెళ్ళింది. దానికి కారణాలను మాత్రం భార్యాభర్త ఎవరు తెలియ చేయలేదు..
తాజాగా మళ్లీ ఈ విషయాన్ని ప్రస్తావించడానికి కారణం ఏంటని అనుకుంటున్నారా.. విజయ్, అమలాపాల్ విడాకులకు కారణం హీరో ధనుష్ అని విజయ్ తండ్రి చెప్పడం జరిగింది. అమల పాల్ ధనుష్ సినిమాలో నటిస్తానని ఇంట్లో గొడవ పెట్టుకోవడం వలన వీరిద్దరూ మనస్పర్ధలు వచ్చి విడిపోయారని వెల్లడించారు.
ఈ విషయం పై పెద్ద చర్చ జరుగుతున్నా హీరో ధనుష్ కానీ, అమలాపాల్ కానీ, అమల మాజీ భర్త దర్శకుడు విజయ్ కానీ ఎవరు స్పందించకపోవడం గమనార్హం. అయితే ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో స్పందించక తప్పలేదు ఈ అమ్మడికి. మా విడాకులకు ధనుష్ కారణం కాదు మేము వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయాం అని చెప్పుకొచ్చింది. అయితే ధనుష్ నాకు మంచి స్నేహితుడు అని అతనితో స్నేహం చాలా కాలం నుంచి కొనసాగుతుంది. ఇక ముందు కూడా ఉంటుందని చెప్పకనే చెప్పింది ఈ బ్యూటీ. ఈ విషయంపై నెటిజన్స్ ట్రొల్ చేయడం మొదలు పెట్టారు.
































