తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి జంబలకడిపంబ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన నటి ఆమని ఆ తర్వాత శుభలగ్నం, మిస్టర్ పెళ్ళాం వంటి చిత్రాలలో నటించి నటిగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆమని ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైన ప్రస్తుతం తన రెండవ ఇన్నింగ్స్ తల్లి పాత్రల ద్వారా మరోసారి ప్రేక్షకులను సందడి చేయడానికి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు.

ఈ క్రమంలోనే ఆమని మరొక హీరోయిన్ ఇంద్రజతో కలిసి బుల్లితెరపై ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. ఈ క్రమంలోనే ఆమని కెరియర్ మొదట్లో తను ఎదుర్కొన్న అవమానాలను గురించి ఈ సందర్భంగా అభిమానులతో పంచుకున్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల కావడంతో కాస్త వైరల్ గా మారింది.

ఈ ప్రోమోలో భాగంగా ఆమనీ మాట్లాడుతూ.. తనకు దొంగతనం చేసిన మామిడి పండ్లు తినడం ఎంతో ఇష్టమని ఈ విధంగా తన ఇష్టాఇష్టాలను తెలిపారు. అదే విధంగా తనకు ఐదు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే సినిమాలంటే ఎంతో పిచ్చని, అప్పుడే శ్రీదేవి, జయసుధ జయప్రద వంటి తారలను చూస్తూ పెరిగానని,ఆమని తెలిపారు.

ఇక పెద్దయిన తర్వాత తనకు సినిమాల్లో నటించాలనే కోరిక కలిగింది. ఈ క్రమంలోనే ఇదే విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పడంతో తన కుటుంబ సభ్యులు తనని చూసి హేళన చేశారని.. నలుగురితో సరిగ్గా మాట్లాడటం రాదు నువ్వు సినిమాలలో ఏం నటిస్తావు? పైగా పెద్ద అందగత్తెవి కూడా కాదని తన కుటుంబ సభ్యులు అనడంతో ఆ సమయంలో చాలా బాధ పడ్డానని ఈ సందర్భంగా ఆమని తెలియజేశారు. ప్రస్తుతం ఈమె సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయడమే కాకుండా బుల్లితెరపై ముత్యమంతా ముద్దు అనే సీరియల్ ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.































