మానవ శరీరంలోని అవయవాలు సరైన క్రమంలో పని చేయాలంటే తప్పకుండా నీరు అవసరమవుతుంది. మన శరీరానికి నీరు ఎంతో అవసరం.రోజుకు తగినంత మోతాదులో నీటిని తీసుకోవటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయనే విషయం మనకు తెలిసిందే. అధికంగా నీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలగడంతో పాటు చర్మ సమస్యలు కూడా తొలగిపోతాయని చెబుతారు. అయితే నిద్రలేవగానే నీటిని తాగటం వల్ల మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు.

ఉదయం నిద్రలేవగానే నీటిని తాగటం వల్ల రోజంతా ఎంతో ఉత్సాహంగా, చురుకుగా ఉంటారు. అదేవిధంగా పరగడుపున నీటిని తీసుకోవటం ద్వారా మన ప్రేగులలో ఏర్పడిన మలినాలన్నీ బయటకు విసర్జించడం ద్వారా ప్రేగులు శుభ్రం అవుతాయి. అదేవిధంగా జీర్ణక్రియ పనితీరు మెరుగుపడటమే కాకుండా, మలబద్ధక సమస్యను నివారిస్తుంది. పరగడుపున మనం తీసుకునే నీరు మన శరీరంలో జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
మనలో చాలామంది ఆకలి లేమి సమస్యతో బాధపడుతుంటారు. ఈ విధమైన సమస్యతో బాధపడేవారు ప్రతిరోజూ ఉదయం నీటిని తాగటం వల్ల పేగులలో ఉన్న వ్యర్థాలు బయటకు తొలగిపోయి ఆకలిని పెంచుతాయి. అదేవిధంగా మన శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తాయి. ప్రతిరోజు కనీసం నాలుగు బాటిల్ ల నీటిని త్రాగటం వల్ల శరీరం పొడిబారకుండా, మన చర్మానికి కావాల్సిన తేమను అందిస్తుంది. అదేవిధంగా మూత్రపిండాలలో ఏర్పడినటువంటి ఇన్ఫెక్షన్, రాళ్లను కూడా బయటకు పంపుతుంది.కనుక వీలైనంత వరకు ఉదయం నిద్రలేవగానే నీటిని త్రాగటం వల్ల ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.




























