Analyst Damu Balaji : అమెరికా లో మనవాళ్ళ ప్రాక్సి బతుకులు… అమెరికా నే మోసం చేస్తున్న తెలుగువాళ్ళు…: అనలిస్ట్ దాము బాలాజీ

0
36

Analyst Damu Balaji : తెలుగు రాష్ట్రాల వాళ్లకు ముఖ్యంగా కోస్తా వాళ్లకు అమెరికా వెళ్లడం అంటే ఒక స్టేటస్ లాగా చూసేవాళ్ళు. అయితే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇండియాలో బాగా అభివృద్ధి చెందాక ఇంజనీరింగ్ కళాశాలలు పెరిగాయి అమెరికా వెళ్లే వారి సంఖ్య పెరిగింది. ప్రస్తుతం ఆమెరికా లో ఉన్న తెలుగు వల్ల సంఖ్య 70 లక్షల పైమాటే. తెలుగు మాట్లాడే వారి సంఖ్య అక్కడ పెరిగిపోతోంది . ఇదంతా మనకు చెప్పుకోడానికి బాగానే ఉన్న అసలు అమెరికాకు టాలెంట్ తోనే మన వాళ్ళు వెళ్తున్నారా అన్నది సందేహం. ఇపుడిప్పుడు వెలుగులోకి వస్తున్న నిజాలు మనకు ఆశ్చర్యం కలిగిస్తాయి. మనవాళ్ళు అమెరికా దేశాన్ని బోల్తా కొట్టించి అక్కడ ఉద్యోగం సంపాదిస్తున్న వైనం గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

ప్రాక్సి బతుకు బతుకుతున్న తెలుగోడు…

అమెరికా వెళ్లాలని కలలు కనీ యువత ఇంజనీరింగ్ వంటి వృత్తి విద్యలో పట్టా పొందాక అక్కడి యూనివర్సిటీ లో సీటు సాధించడం కోసం టోఫెల్,జి మాట్ వంటి పరీక్షలను రాసి అందులో సెలక్ట్ అయితే అక్కడి యూనివర్సిటీ ద్వారా అడ్మిషన్ అలాగే వీసా పొంది అమెరికా వెళ్లి అక్కడ చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుయ్యాక అక్కడే ఉద్యోగం చూసుకుని సెటిల్ అయిపోతున్నారు. ఇదంతా బాగానే ఉన్న అసలు ఇంజనీరింగ్ ను డబ్బులుచ్చి సర్టిఫికెట్ కొన్న కొంతమంది ఆ తరువాత కొన్ని అన్ ఆఫీషియల్ కన్సెల్టేన్సీ ద్వారా వేరే వాళ్ళ చేత అమెరికన్ యూనివర్సిటీస్ కి ఎంట్రన్స్ పరీక్ష రాయించి అందులో సెలెక్ట్ అయ్యాక వీసా పొంది ఆమెరికా వెళ్తున్నారు.

అక్కడ కూడా యూనివర్సిటీ లో చదువుకోకుండా వేరే వాళ్ళను తమ పేరు మీద ఎగ్జామ్స్ అలానే ప్రాజెక్ట్స్ చేయించి పట్టా పొందుతున్నారు. ఇదంతా ఇతరులను డబ్బు తో మేనేజ్ చేసి తమ పేరు మీద వేరే వాళ్ళు తమ పని చేసేలా చేస్తున్నారు ఈ విధానం నే “ప్రాక్సీ” అంటారు. ఇలా ఉద్యోగం కూడా ఇతరుల ద్వారానే తెచ్చుకుని ఆ ఉద్యోగం కూడ వాళ్ళు చేయకుండా వేరే వాళ్ళతో చేయించి జీతంలో కొంత వారికి ఇస్తున్నారు. ఇలా కొంతమంది ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలను చేస్తున్నట్లు తాజాగా కనుగొన్నారని బాలాజీ అభిప్రాయపడ్డారు. ఇలా ప్రాక్సీ స్కాం చేస్తున్న వారిలో తెలుగువాళ్ళే ఎక్కువగా ఉన్నారు. డబ్బు ద్వారా డబ్బు సంపాదిస్తూ అమెరికా లాంటి దేశాన్నే మోసం చేస్తున్నారని బాలాజీ తెలిపారు. ఫేక్ గ్రీన్ కార్డు ద్వారా అక్కడి లోకల్ కంపెనీ హెచ్ ఆర్ ను మేనేజ్ చేసి ఉద్యోగలను సైతం తెచ్చుకుంటున్న వీరు తేడా వస్తే మేక్సికో కి వెళ్లిపోతున్నారు అంటూ బాలాజీ తెలిపారు.