Analyst Damu Balaji : వివేకానంద రెడ్డి మరణించి నాలుగేళ్లు కావొస్తున్నా చంపింది ఎవరనే విషయాలు స్పష్టంగా ఇప్పటికీ తెలియరాలేదు. ఏపీ సీఎం కి సొంత బాబాయ్ అయినా ఎవరు చంపారో ఇప్పటికీ తేలక పోవడం పట్ల అటు విపక్షాల నుండి గట్టి విమర్శిలే ఎదుర్కొంటున్న జగన్ ఇంట్లోనే హంతకులున్నారనే కథనాలు వినిపిస్తున్నా విమర్శకు కౌంటర్లు వేస్తున్నారే కానీ కేసులో మాత్రం పురోగతి లేదు. రోజుకో పేరు బయటికి వస్తోంది, ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు అంటూ వార్తలు వినిపించినా అవేవి జరగలేదు. అయితే తాజాగా అవినాష్ రెడ్డిని విచారించడానికి సిబిఐ మరోసారి పిలవడం, అవినాష్ రాలేనని చెప్పడం వంటి ఆసక్తికర సంఘటనల నడుమ ఈ కేసులో ఏం జరగనుంది అన్నది అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

అవినాష్ అరెస్టు అంటూ ఆయన మాట్లాడారు…
దాము బాలాజీ మాట్లాడుతూ అవినాష్ రెడ్డిని సిబిఐ మరోసారి విచారణకు రమ్మని పిలిస్తే ఇప్పటికిప్పుడు రమ్మని చెబితే మిగిలిన నా ఆపనులకు అంతరాయం కలుగుతుంది కనుక నాలుగు రోజులు టైం కావాలి అంటూ అవినాష్ తరుపు లాయర్ అడగడటం, కుదరదని సిబిఐ చెప్పడం నేపథ్యంలో అవినాష్ హాజరవుతాడా లేక కడపలో ఉన్న ఒక సిబిఐ బృందం ఆయనను అదుపులోకి తీసుకుంటుందా అన్నది చర్చగా వినిపిస్తోంది అంటూ బాలాజీ మాట్లాడరు.

ఈ కేసులో మొదటి నుండి అవినాష్ రెడ్డి అరెస్టు అంటూ వినిపిస్తున్నా ఇప్పటికీ జరగలేదు అయితే వైసీపీ వ్యతిరేక మాధ్యమాలు అరెస్టు తప్పదు అంటుంటే సుప్రీం కోర్ట్ నిన్ను అరెస్టు చేస్తారని ఎందుకు అనుకుంటున్నావ్ అంటూ బెయిల్ పిటిషన్ మీద ప్రశ్నించడం చూస్తుంటే సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకపోవచ్చని అనిపిస్తుందని బాలాజీ అభిప్రాయపడ్డారు. ఇక ఎంపీ రఘురామ కృష్ణం రాజు గారు మాట్లాడిన మాటలను బాలాజీ ప్రస్తావించారు. ఆయన సిబిఐ బాగా పనిచేస్తోందని ఓవైపు చెబుతూనే అవినాష్ ను అరెస్టు చేయలేదంటే సిబిఐ కి వారికి ఏదో ఋణానుబంధం ఉన్నట్లే అంటూ రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఒకవేళ సిబిఐ అరెస్టు చేస్తే బాగా పనిచేసినట్లు లేదంటే సిబిఐ నమ్మకమైన ఏజెన్సీ కాదు అన్నట్లుగా ఆయన మాట్లాడారు అంటూ బాలాజీ తెలిపారు.