Analyst Damu Balaji : 30 ఏళ్ల తరువాత మరోసారి ట్రైన్ ఆక్సిడెంట్ భయానక పరిస్థితులను చూపించింది. ట్రాకుల మీద పడిన శవాలు, తెగిపడిన అవయవాల గుట్టలు అక్కడి దృశ్యం అంత భీతవాహంగా మారిపోయింది. తాజాగా జరిగిన కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు దుర్ఘటనలో వందలాది మంది మరణించగా చాలా మంది గాయపడి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. సిగ్నలింగ్ వ్యవస్థ లోపమో, నిర్లక్ష్యమో ఏదైనా కొన్ని వందల కుటుంబాలకు విషదాలను మిగిలిచ్చింది. మొదట లోకో పైలట్ తప్పు వల్లే ప్రమాదం జరిగిందని భావించినా సిగ్నల్ తప్పుగా ఇవ్వడం వల్లే ప్రమాదం జరిగిందని స్పష్టం చేసారు. ఇక ఈ దుర్ఘటన గురించి మరిన్ని విషయాలను అనలిస్ట్ దాము బాలాజీ తెలిపారు.

లోకో పైలట్ మృతి… గార్డ్ తప్పించుకున్నాడు…
ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి స్థానిక యువత చొరవ తీసుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అలాగే రక్తదానం చేయడానికి క్యూ కట్టడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. మారుమూల గ్రామాల నుండి వచ్చిన యువత దాదాపు 200 వందల మందిని కాపాడారని అంచనా. పక్కన ఉన్న హౌరా రైలులో ప్రయాణిస్తున్న జవాన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో పనిచేసిన అనుభవం ఉండటం వల్ల వెంటనే తన పై అధికారులకు వార్త అందించి లొకేషన్ కరెక్ట్ గా పెట్టడం వల్ల సకాలంలో అధికారులు చేరి సహాయం చేయగలిగారని తెలిపారు.

అలాగే మిలిటరీ అధికారి వెంకటేష్ అక్కడి స్థానిక యువతకు కొంత గైడన్స్ ఇచ్చి గాయపడిన వారిని బయటకు తీసేందుకు సహాయపడ్డారు. ఇక ట్రైన్ నడిపిన డ్రైవర్ మరణించగా ఎదురుగా దీకొట్టిన గూడ్స్ ట్రైన్ గార్డ్ ప్రమాదం నుండి బయట పడ్డారు. ఇక మరో రైల్వే అధికారి సమాచారం తెలియడం లేదని, పారిపోయాడనే వార్తలు వస్తున్నాయని బాలాజీ తెలిపారు. ఇక ప్రస్తుతం సిబిఐ విచారణకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఘటనా స్థలంలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.