Analyst Damu Balaji: దస్తగిరి దాదా గిరి….వేలకోట్ల రూపాయల లాండ్ సెటిల్మెంట్స్…: అనలిస్ట్ దాము బాలాజీ

0
131

Analyst Damu Balaji: వైఎస్ వివేకానంద రెడ్డి హాత్య 2019 ఎన్నికల ముందు జరుగగా ఇప్పటికీ ఎవరు చంపారు , ఎందుకు చంపారు అనే విషయాలు తెలియవు. సీబీఐ విచారణ జరుగుతూనే ఉన్న నిజానిజాలు వెలుగులోకి రాలేదు. అయితే వివేకానందరెడ్డి ను చంపింది నేనే అంటు కోర్టులో అప్రోవర్ గా మారిన దస్తగిరి ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్నాడు. పలు మీడియా ఛానెల్స్ లో మాట్లాడుతు బాగా పాపులర్ అయ్యాడు. అయితే తాజాగా దస్తగిరి గురించి పలు ఆసక్తికర విషయాలను అనలిస్ట్ దాము బాలాజీ తెలిపారు.

సెట్టెల్మెంట్స్ చేస్తూ ….

దాము బాలాజీ మాట్లాడుతూ దస్తగిరి ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉంటు సెటిల్మెంట్ దందాలు చేస్తున్నాడని చెప్పారు. కడప జిల్లాలో భూ తగాదాలు వంటి వాటిలో బెదిరింపులు చేయడం చంపేస్తా అంటు మాట్లాడటం చేస్తున్నాడని వివరించారు. ఎవరికైనా బెదిరించాలంటే వివేకానందను చంపిన వ్యక్తిని మీకు అదే గతి పడుతుంది అంటు బెదిరింపులకు దిగినట్లు చెప్పారు.

ఇక కోట్లల్లో దందాలు నిర్వహిస్తున్న దస్తగిరి 2019 కు ముందు ఒక ఐస్ క్రీమ్ బండి పెట్టుకుని బతికానని స్వయంగా అతనే చెప్పాడని బాలాజీ అభిప్రాయపడ్డారు. వివేకానంద కేసు కంటే ముందు కూడా అతని మీద పలు నేరారోపణలు ఉన్నట్లు తెలిపారు.