Analyst Damu Balaji : నిజమైన ఎన్టీఆర్ వారసుడు అతనే… లక్ష్మి పార్వతి హాట్ కామెంట్స్…: అనలిస్ట్ దాము బాలాజీ

0
174

Analyst Damu Balaji : స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి శత జయంతి ఉత్సవాలు ఒకవైపు జరుపగా మరోవైపు టీడీపీ మహానాడు ను అట్టహసంగా నిర్వహించింది. అయితే ఎన్టీఆర్ శత జయంతి దేవినేని కుటుంబం ఆధ్వర్యంలో లక్ష్మి పార్వతి, పోసాని కృష్ణ మురళి వంటి వరు నిర్వహించి ఎన్టీఆర్ గారి గొప్పతనం చెబుతూనే మరోవైపు చంద్రబాబును, టీడీపీ ని విమర్శించారు. ఇక ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

నిజమైన ఎన్టీఆర్ వారసుడు అతనే…

లక్ష్మి పార్వతి మొదటి నుండి చంద్రబాబు టార్గెట్ గా విమర్శలను గుప్పిస్తుంటారు. ఇక వైసీపీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక ఇంకా విమర్శలను ఎక్కువ చేస్తున్నారు. మహానాడు లో అసలైన నందమూరి వారసులు ఎవరూ లేరని, ఆయనను చంపిన వారే నేడు ఆయనకు నివాళి అర్పిస్తున్నారంటూ మాట్లాడారు. శత జయంతి ఉత్సవాలకు రాకుండా జూనియర్ ఎన్టీఆర్ మంచిపని చేసాడని, అతనే ఎన్టీఆర్ గారికి నిజమైన వారసుడంటూ పేర్కొన్నారు.

లోకేష్ మహానాడు లో మా తాత అంటూ మాట్లాడుతాడు, వాళ్ళ తాత ఖర్జురపు నాయుడు కానీ ఎన్టీఆర్ కాదు అంటూ లక్ష్మి పార్వతి విరుచుకుపాడ్డారని బాలాజీ తెలిపారు. ఇక ఆర్జీవి, పోసాని కూడా మహానాడు టార్గెట్ గా పలు విమర్శలను గుప్పించారు. లక్ష్మి పార్వతి గొప్పతనం వివరించారు. ఇక ఆర్జీవి అయితే మహానాడు వేదిక మీద ఉన్న వారంతా నర హంతకులే అంటూ మాట్లాడాడు అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.