Analyst Damu Balaji : మణిపూర్ అల్లర్లకు అసలు కారణం ఏంటి…: అనలిస్ట్ దాము బాలాజీ

0
45

Analyst Damu Balaji : ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ గత కొన్ని రోజులుగా అట్టుడికిపోతోంది. రెండు తెగల మధ్య ఘర్షనతో ఆ రాష్ట్రము అట్టుడుకుతోంది. నెల రోజుకుగా జరుగుతున్న మారణకాండలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మణిపూర్ అల్లర్లలో మహిళల నగ్న ప్రదర్శన చేసారంటూ వార్తలు రావడంతో ఒక్కసారిగా దేశం మొత్తం అలజడి రేగింది. రెండు తెగల మధ్య ఇంతటి వైరం రావడానికి కారణం ఏమిటి వంటి విషయాలను అనలిస్ట్ దాము బాలాజీ తెలిపారు.

అల్లర్లకు అసలు కారణం అదే…

ఈశాన్య రాష్ట్రం అయిన మణిపూర్ ఒకప్పుడు కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటూ ఆపైన రాష్ట్రంగా అవతరించింది. అయితే మణిపూర్ కి ఒకవైపు అస్సామ్, నాగాలాండ్ ఉండగా మారోవైపు మాయన్మార్ దేశంతో సుధీర్ఘమైన సరిహద్దు పంచుకుంటోంది. ఇక మణిపూర్ లో ఇపుడు జరుగుతున్న అల్లర్లు ముఖ్యంగా రెండు తెగల మధ్య జరుగుతున్నాయి. ఒకటి మైతీలు మరొక తెగ కుకీలు. ఇక్కడ మైతీలు రాజధాని ఇంఫాల్ ప్రాంతపు లోయలో ఉండగా కుకీలు, నాగా తెగ వారు కొండ ప్రాంతంలో ఉంటున్నారు. 10% భూభాగంలో మైతీలు 53% జానాభా కలిగి ఉండగా వీరున్న ప్రాంతం అభివృద్ధి చెంది సదుపాయాలు బాగా ఉండటం రాజకీయంగాను ఎదగడం వల్ల వీళ్ళ డామినేషన్ అక్కడ కనిపిస్తుంది. అయితే ఈ తెగ వాళ్ళు పదేళ్లుగా తమను ఎస్టి లోకి చేర్చాలని ఆందోళన సాగిస్తుండగా అందుకు వ్యతిరేకంగా కుకీలు, నాగాలు ఆందోళనలు చేస్తున్నారు. 90% కుకీలు, నాగాలు ఉన్న భూమిలోకి ఎస్టీలను కానీ మైతీలను అనుమతించరు. ఆ భూభాగంలో వారు ఎటువంటి లావాదేవీలు చేయలేరు. అందుకే వారు ఎస్టీ ల్లోకి తమను చేర్చాలని మైతీలు కోరుకుంటున్నారు.

అయితే ఆల్రెడీ అభివృద్ధి చెందిన మైతీలను ఎస్టీ లోకి చేరిస్తే తమకు మరింత అన్యాయం జరుగుతుందని కుకీలు, నాగాలు భావిస్తున్నారు. హై కోర్ట్ మైతీల విన్నపాన్ని పరిశీలించమని ప్రభుత్వంను కోరడంతో మే 3 నుండి ఆందోళనలు ఎక్కువయ్యాయి. కుకీలు, చేస్తున్న ర్యాలీని మైతీలు అడ్డుకోవడంతో హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయని సుమారు 100 మంది చనిపోగా, వందల మంది గాయపడ్డారని బాలాజీ తెలిపారు. ఊర్లకు ఊర్లను తగులబెట్టారని చెప్పారు. ఇక మైతీలు కుకీలు కలిసి ఉన్న కొన్ని గ్రామాలలో మైతీలు ఆడవారిని అత్యాచారం చేసారనే వదంతులు వ్యాపించడంతో ఒక గ్రామంలో మైతీల తెగకు చెందిన ముగ్గురు మహిళలను నగ్నంగా ఊరంతా తిప్పి వారిని హింసించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందంటూ బాలాజీ తెలిపారు. పోలీసుల ముందే ఈ ఘటన జరిగిందని తెలిపారు. ప్రస్తుతం ఇక వ్యక్తిని అరెస్టు చేయగా మైతీలు దాడి చేస్తున్నారనే వదంతులు వ్యాపించడం వల్లే ఇలా చేశామని చెప్పాడు. ఇక కేంద్రం ప్రస్తుతం మణిపూర్ లోని పరిస్థితి మీద ఫోకస్ చేసిందని బాలాజీ తెలిపారు.