Analyst Damu Balaji : ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఓ వైపు జరుగగా ఇక స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి నాడు టీడీపీ జరుపుకునే మహానాడు కార్యక్రమం కూడా మొదలయింది. ఆ వేడుకలో టీడీపీ శ్రేణులకు అధినేత చంద్రబాబు పార్టీ కి సంబంధించిన విషయాలను చెప్పడంతో పాటు కార్యకర్తలను ఉత్సాహపరిచేలా స్పీచ్ లతో నేతలు ఆకట్టుకుంటారు. ఈసారి మహానాడు లో అచ్చెన్నాయుడు మాట్లాడిన స్పీచ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆయన ఈసారి గెలుపు టీడీపీ దే అని చెబుతూ 160 సీట్లు మనం గెలుస్తాం అంటూ చేసిన వాఖ్యలు ఆసక్తికరంగా మారాయి అంటూ అనలిస్ట్ దాము బాలాజీ ఈ స్పీచ్ గురించి విశ్లేషించారు.

పవన్ ను పక్కన పెట్టిన టీడీపీ…
మహానాడు లో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ టీడీపీ నెక్స్ట్ ఎలక్షన్ లో 160 సీట్లు గెలుస్తుందని జోష్యం చెప్పారు. అయితే 175 సీట్లకు 160 సీట్లు టీడీపీ గెలిస్తే మరి తనతో పాటు ఉన్న జనసేన కు మిగిలిన 15సీట్లు ఇస్తున్నట్లు అర్థం చేసుకోవాలా లేక మిగిలిన సీట్లు వైసీపీ కి అని అర్థం చేసుకోవాలో టీడీపీ వారే క్లారిటీ ఇవ్వాలంటూ అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు. జగన్ 175 కి 175 గెలుస్తామంటూ చెప్పాడం ఒకింత అసాధ్యమే అయినా మైండ్ గేమ్ ఆడుతున్నాడనేది అర్థం అవుతుంది.

అయితే టీడీపీ లెక్కలలో పరమార్థం పవన్ ను దూరం పెట్టడమే అని అర్థమవుతోందని అనలిస్ట్ దాము బాలాజీ అభిప్రాయపడ్డారు. పవన్ తాజాగా మనం ఇంతవరకు ఒక్క సీటు గెలవలేదు, కొన్నైనా గెలిచి ఉంటే సీఎం సీటు గురించి ఆలోచించేవాడిని అన్నట్లు నిరుత్సాహపూరిత మాటలు మాట్లాడటం, తాజాగా టీడీపీ సోషల్ మీడియాలో పవన్ లేకపోయినా టీడీపీ ఒంటరిగా గెలవగలదు అన్నట్లు కామెంట్స్ పెట్టడం పవన్ ను దూరం పెడుతున్నారా అనే అనుమానలను కలిగిస్తున్నాయని బాలాజీ తెలిపారు.

































