Analyst Damu Balaji : వివేకానంద కేసులో సంచలనం… 259వ సాక్షిగా షర్మిల షాకింగ్ నిజాలు వెల్లడి…: అనలిస్ట్ దాము బాలాజీ

0
164

Analyst Damu Balaji : 2019 ఎన్నికల ముందు రాష్ట్రంలో సంచలనం రేపిన హత్య కేసు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య. తన ఇంట్లోనే రాత్రి బాత్రూంలో శవమై కనిపించారు వివేకానంద రెడ్డి. ఈ హత్య మీద విచారణ తొలుత రాష్ట్ర పోలీసులు చేసినా కేసును తప్పుదోవా పట్టిస్తున్నారనే అనుమానంతో వివేకానంద రెడ్డి కూతురు సునీత గారు కోర్ట్ ను ఆశ్రయించి పక్క రాష్ట్రం అయిన తెలంగాణ సిబిఐ కి ట్రాన్సఫర్ చేయించుకున్నారు. జగన్ సొంత బాబాయ్ హత్య, రాజకీయంగా ప్రకంపణలు రేపుతున్నా ఇప్పటికీ అసలు నేరస్థులు బయటికి రాలేదు. తాజాగా ఈ కేసులో మరొక సంచలనం రేగింది అంటూ అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

సాక్షిగా షర్మిల ఏం చెప్పిందంటే…

వివేకానంద కేసులో సిబిఐ మరోసారి ఛార్జ్ షీట్ దాఖలు చేయగా అందులో షర్మిల చెప్పిన సాక్ష్యం అంటూ మీడియాలో బాగా వైరల్ అవుతున్న విషయం గురించి మాట్లాడారు. వివేకానంద కేసును రాజకీయంగా మార్చేసారని అందులో టీడీపీ అనుకూల మీడియా ఒకలాగా షర్మిల మాటలను చెబుతుంటే మరోవైపు వైసీపీ పార్టీ అనుకూల మీడియా మరో విధంగా చెబుతోందని తెలిపారు. షర్మిల వద్దకు వివేకానంద వచ్చి ఎన్నికల ముందు ఎంపీగా పులివెందుల నుండి పోటీ చేయి, అవినాష్ కి ఇవ్వడం వద్దు అని చెప్పారట. అయితే షర్మిల ఆ ప్రతిపాదనకు జగన్ ఒప్పుకోడని చెప్పగా వివేకానంద నేను జగన్ తో మాట్లాడుతా అన్నారంటూ షర్మిల తన స్టేట్మెంట్ లో చెప్పారు.

ఇక జగన్ అవినాష్ కి సపోర్ట్ చేయడం పట్ల మా ఇంట్లో బయటికి కనిపించని కోల్డ్ వార్ ఉందని షర్మిల తెలిపినట్లు టీడీపీ అనుకూల మీడియా చెబుతున్నా నిజానికి జగన్ పార్టీ పెట్టి పైకి వచ్చారు కనుక ఎవరికి టికెట్ ఇవ్వాలనే విషయంలో ఆయనకే అధికారం ఉంటుంది. ఈ విషయం పట్టుకుని వివేకానంద హత్యకు ముడిపెట్టడం కరెక్ట్ కాదు అంటూ చెప్పారు.