Analyst Damu Balaji : వికారాబాద్ జిల్లా, పరిగి మండలం, కడ్లాపూర్ గ్రామానికి చెందిన నర్సింగ్ విద్యార్థి శిరీష ఆదివారం నాడు ఊరిలో ఉన్న కుంటలో మృత దేహమై కనిపించడిసంతో ఒక్కసారిగా ఆ గ్రామంలో అలజడి రేగింది. పోలీసుల ప్రాథమిక విచారణలో శిరీష ఇంట్లో తండ్రి, అక్క భర్త అనిల్ కొట్టి ఫోన్ లాక్కోవడంతో మనస్థాపం చెంది అర్ధరాత్రి కుంటలో పడి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె కంటికి గాయాలు తగలడం, అలాగే శరీరం మీద గీసుకుపోయిన గాయాలు ఉండటంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక తాజాగా జాతీయ మహిళా కమిషన్ ఈ కేసును సుమోటోగా స్వికరించి డిజిపి కి లేఖ పంపి విచారణ వేగవంతం చేయాల్సిందిగా కోరడం జరిగింది. ఈ కేసులో శిరీష అక్క భర్త అనిల్ మీద అనుమానాలు మొదలవడంతో ఆ కోణంలో విచారణ జరగాల్సి ఉంది. అయితే ఈ కేసు గురించి మరిన్ని వివరాలను అనలిస్ట్ బాలాజీ వివరించారు.

శిరీష ను చంపిందో బావేనా…
శిరీష ఆత్మహత్య చేసుకుందని పోలీసులు పోస్టుమార్టం తరువాత పేర్కొన్నా కడ్లాపూర్ గ్రామస్థులు మాత్రం పలు అనుమానలను వ్యక్తం చేస్తున్నారు అంటూ బాలాజీ తెలిపారు. శిరీష తండ్రి జంగయ్య అలాగే అక్క భర్త అనిల్ మీద అనుమానాలను వ్యక్తం చేసారు. పోస్టుమార్టం ముగించి మృతదేహన్ని కుటుంబానికి అప్పిగించినా మరోసారి పొట్టమార్టం నిర్వహించి వైద్య అధికారిని వైష్ణవి గ్రామస్థులకు శిరీష మృతి పట్ల వివరణ ఇచ్చారు.

ఆమె ఊపిరి తిత్తుల్లో నీరు చేరడం వల్లే చనిపోయిందని కంటి మీద గాయాలు కుంటలో పడినపుడు ముళ్ళు వంటివి గుచ్చుకోవడం వల్ల ఏర్పడినవని తెలిపారు. అయినా గ్రామస్థులు జంగయ్య మీద దాడికి పాల్పడ్డారు అంటూ చెప్పారు బాలాజీ. ఈ కేసులో ఆత్మహత్యగా అన్ని రిపోర్టులు చెబుతున్నా కొన్ని మీడియా సంస్థలు శిరీష భర్త అనిల్ మీద అనుమానాలు ఉన్నాయంటూ కథనాలు ప్రసారం చేసాయి. ఒకవేళ అనిల్ ఏదైనా చేసుంటే కచ్చితంగా పోలీసుల విచారణలో తీలేది అంటూ బాలాజీ తెలిపారు.































