పూర్తయిన ఆనంద్ దేవరకొండ ‘హైవే’ షూటింగ్.. పోస్టర్ ను విడుదల చేసిన సినీ బృందం!

0
209

డైరెక్టర్ కె.వి.గుహన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘హైవే’. ఈ సినిమా సైకో క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతుంది. ఇందులో ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. మానస రాధాకృష్ణన్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ ఐశ్వర్య లక్ష్మి మూవీస్ పతాకంపై నిర్మాత వెంకట తలారి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారీ అంచనాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది.

ఈ సినిమా షూటింగును తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో అద్భుతమైన లోకేషన్ లలో జరిపారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తవగా.. ఈ విషయాన్ని తెలియజేయడానికి ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత వెంకట్ కొన్ని విషయాలు పంచుకున్నాడు. డిఫరెంట్ క్రైమ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుందని మంచి కథతో డైరెక్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారని తెలిపాడు.

ఈ సినిమా ప్రారంభం నుండి పాజిటివ్ టాక్ అందిందని ఇక ఈ రోజే ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని తెలిపాడు. మూడు రాష్ట్రాలలో ఈ సినిమా అద్భుతంగా తీశామని తెలిపారు నిర్మాత వెంకట్. ఇక డైరెక్టర్ గుహన్ కూడా ఈ సినిమా గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు. ఈ సినిమా టెక్నికల్ గా అడ్వాన్స్డ్ గా ఉందని అన్నాడు. ఈ కథలో ప్రతీది ట్విస్ట్ తో మలుపు తిరుగుతుందని బాగా ఆసక్తికరంగా ఉంటుందని అన్నాడు. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని అప్ డేట్ లు తెలుపుతామని ప్రకటించాడు.