కన్నీరు పెట్టుకున్న ఆనంద్ మహీంద్రా.. కారణం తెలిస్తే?

0
157

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడు ట్విట్టర్ లో యాక్టీవ్ గా ఉంటూ నెటిజన్లకు ఎంతో దగ్గరగా ఉంటారు. ఎప్పుడు ఫన్నీ వీడియోలను, తన అనుభవాలను షేర్ చేసే ఆనంద మహీంద్రా ఈసారి కూడా ఓ వీడియోను షేర్ చేశారు. అయితే ఆ వీడియోను చూసి కన్నీరు పెట్టుకున్నట్టు.. ఉదయమే ఎంతో బాధ కలిగించిందంటూ ట్విట్ చేశారు. ఎప్పుడు నవ్వుతు ఉండే ఆనంద్ మహీంద్రాను బాధ పెట్టిన వీడియో ఏంటి అనేది మనం ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

ఈ నెల 25 కోసం ఏడాది అంత ఎదురు చూసేవారు ఎందరో ఉంటారు. ఇక మరో పది రోజుల్లో క్రిస్మస్ పండుగా వస్తుంది. అందుకే ఈ నెల ప్రారంభం నుంచే ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యా. ఇక అలానే సోషల్ మీడియాలో కూడా క్రిస్మస్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయ్. ఈ నేపథ్యంలోనే ఆనంద్ మహీంద్రా ఓ వీడియోను చూశారు. ఆ వీడియోను చుసిన ఆనంద్ మహీంద్రా ఆ వీడియో చూసి కన్నీళ్లు వచ్చాయని చెప్పుకొచ్చాడు.

ఆ వీడియోలో ఏముంది అంటే.. 70 ఏళ్ళ వృద్ధుడు ఉదయాన్నే లేచి ప్రతిరోజు బరువులు ఎత్తి వ్యాయామాలు చేస్తుంటాడు. రోజుకు ఒక కేజీ బరువు ఎత్తుతుంటాడు. తనకు ఎదురుగా ఒక అద్దాన్ని పెట్టుకొని, అందులో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ ఒక 20 కేజీలు బరువు కలిగిన ఇనుప గుండును రోజూ ఎత్తడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు. రోజురోజుకు ఆయన చేసే వ్యాయామాలను చూసి చుట్టుపక్కల వారు ఎందుకు ఇంత కష్ట పడుతున్నాడు అంటూ హేళన చేసేవారు. మరికొంతమంది జాలిగా చూసేవారు. ఆ చుట్టుపక్కల వారిలో ఒకరు ఆ వృద్ధుడు కూతురుకు ఫోన్ చేసి మీ నాన్నగారికి ఏదో అయ్యింది అన్నట్టు మాట్లాడుతారు. చివరికి తన కూతురు కూడా తన తండ్రిని అర్థం చేసుకోలేదు. అయినప్పటికీ ఆ వృద్ధుడు మాత్రం చివరి వరకు ప్రయత్నించి అనుకున్న బరువును ఎత్తగలుగుతాడు.

ఆ తర్వాత చాలా అందంగా ముస్తాబై ఒక బహుమతి తీసుకొని, తన మనవరాలిని కలవడానికి ఆమె ఇంటికి వెళ్తాడు. ఆ తర్వాత ఒకరినొకరు చూసుకుని మురిసిపోతారు.తాతయ్యను చూసి ఎంతో ఆప్యాయంగా తాతగారి గుండెకు హత్తుకుంటుంది ఆ చిన్నారి పాప. ఆ వృద్ధుడు ఎంతో ఆనందపడిపోయి, తను తెచ్చిన బహుమతిని మనవరాలికి ఇచ్చి, అందులో ఉన్న స్టార్ ను తీసి,ఆమెని ఎత్తుకొని దానిని క్రిస్మస్ ట్రీ పైభాగంలో పెట్టిస్తాడు. ఇది చూసి ఆ వృద్ధుడి కూతురు కూడా కన్నీటి పర్యంతం అవుతుంది. ఆ మనవరాలిని ఎత్తుకోవడం కోసమే ఆ తాత రోజూ కష్టపడ్డాడని తెలుసుకుని నెటిజన్లు చలించిపోతారు. ఈ వీడియో ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిని మహేంద్ర చూశారు. “మీరు నన్ను ఏడిపించారు. కానీ నాకు ఇంకా మనవరాలు లేదు. ఆ వయసు కలిగిన మనవడు మాత్రమే ఉన్నాడు” అంటూ మహేంద్ర ఉద్వేగానికిలోనై ట్విట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here