ఏవమ్ జగత్ సినిమా నుంచి రాధాస్ లవ్ పాటను విడుదల చేసిన వకీల్ సాబ్ హీరోయిన్..!

0
161

మల్లేశం సినిమా ద్వారా వెండితెరకు పరిచయం చేసిన అనన్య నాగవల్లి వకీల్ సాబ్ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. వకీల్ సాబ్ ఈ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ దినేష్ నర్రా దర్శకత్వంలో మార్స్ మూవీ ప్రొడక్షన్ పతాకంపై మునిరత్నం నాయుడు, రాజేశ్వరి నిర్మిస్తున్నటువంటి చిత్రం “ఏవమ్ జగత్” సినిమా నుంచి “రాధాస్ లవ్” అనే పాటను విడుదల చేశారు. ఈ పాట నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

కిరణ్ గేయ, ప్రకృతి వనం ప్రసాద్,రిటైర్డ్ బ్రిగేడియర్ గణేషమ్, ఇనయ సుల్తానా తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి రాధాస్ లవ్ అనే పాటను వకీల్ సాబ్ హీరోయిన్ అనన్య నాగవల్లి విడుదల చేసారు.

ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ.. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.”ఉదయించే సూర్యిడిలా ..ప్రతిరోజు నిను చూసా ..”అంటూ సాగిపోయే ఈ పాట ఎంతో అద్భుతంగా వచ్చిందని, శివకుమార్ మ్యూజిక్ ఎంతో అద్భుతంగా ఉందని చిత్ర బృందం వెల్లడించారు. ఇక ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ.. రాబోయే రోజులలో వ్యవసాయ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి .. రాబోయే తరానికి కావాల్సిన ఆహారం పండించగల అనుభవం మన దేశంలోని యువతకు ఉందా.. అనే అంశాలను ప్రధానంగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని తెలియజేశారు.

అచ్చమైన పల్లెటూరిలో సాగే ఈ కథ దేశ పురోగతికి అద్దం పడుతుందని, ఎన్ని కష్టాలు ఎదురైనా అనుకున్నది ఏ విధంగా సాధించాడు అనేది ఈ చిత్రంలో ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని దర్శకుడు తెలియజేశారు.ప్రస్తుతం షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని దర్శకుడు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here