Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు ఒకప్పుడు బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం బుల్లితెరకు గుడ్ బై చెప్పి వెండితెర సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించిన అనసూయ ఈ కార్యక్రమం ద్వారా ఎంతో పాపులారిటీ సొంతం చేసుకుని ఆ పాపులారిటీతో సినిమా అవకాశాలను అందుకున్నారు.

ఇలా వరుస సినిమా అవకాశాలు రావడంతో ఈమె జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పారు.అయితే జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్ళిపోవడానికి గల కారణం కూడా గతంలో అనసూయ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎక్కువగా బాడీ షేమింగ్ జరుగుతోందని అందుకే తాను ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని గతంలో వెల్లడించారు.
తాజాగా ఈమె జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్ళడానికి గల కారణాన్ని తెలియజేశారు.ఇలా ఈమె జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్ళడానికి గల కారణం తన ఇద్దరు కుమారులేనని చెప్పేశారు.ఒకవైపు బుల్లితెర కార్యక్రమాలతోనూ మరోవైపు వెండితెర సినిమాలతోను తాను బిజీగా గడుపుతూ తన సమయాన్ని పిల్లలకు కేటాయించలేకపోతున్నానని తెలిపారు.

Anasuya Bharadwaj: పిల్లలకు సమయం కేటాయించలేకపోవడమే కారణం…
ఇలా సినిమాలలో నటించడం వల్ల తనకు మంచి ఆదాయం వస్తుంది. అలాగే జబర్దస్త్ లో చేసిన మరికొంత ఆదాయం వస్తుంది కానీ పిల్లలతో కలిసి సమయం గడపడానికి కుదరకపోవటం వల్లే తాను జబర్దస్త్ కార్యక్రమం నుంచి పూర్తిగా తప్పుకున్నాననీ ప్రస్తుతం ఈమె చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.































