డబ్బింగ్ పనుల బిజీలో అనసూయ.. ‘ఫ్లాష్ బ్యాక్’లో పవర్ ఫుల్ పాత్రలో..!

0
204

జబర్దస్త్ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అనసూయ. ఆమె బుల్లితెరలోనే కాదు.. వెండితెరపై కూడా ఓ వెలుగు వెలిగిపోతున్నారు. రంగస్థలం సినిమాతో తాను ఏ పాత్రలో అయినా నటించగలిగే సత్తా అందంటూ నిరూపించింది. దాని ఫలితంగానే ఆమెకు వరుస ఆఫర్లు వచ్చిపడుతున్నాయి.

తాజాగా ఆమె పుష్ప, ఆచార్య, ఖిలాడీ చిత్రాల్లో కూడా నటిస్తోంది. ఇవే కాకుండా ‘ఫ్లాష్ బ్యాక్’ చిత్రంతో పవర్ ఫుల్ పాత్రలో నటించారు. ఈ సినిమాకు తాజాగా డబ్బింగ్ పనులు మొదలు పెట్టేసింది. ప్రభు దేవా, రెజీనా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ ఫ్లాష్ బ్యాక్ చిత్రంలో స్పెషల్ రోల్ పోషిస్తున్న యాంకర్ అనసూయ.. తన రోల్ డబ్బింగ్ పనులు పూర్తి చేస్తోంది.

‘ఫ్లాష్ బ్యాక్’ గుర్తుకొస్తున్నాయి అనే ట్యాగ్ లైన్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ డాన్ శ్యాండీ. అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై పీ.రమేష్ పిళ్ళై నిర్మిస్తున్న ఈ సినిమాను ద్విభాషా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత, నిర్మాత ఎ.ఎన్ బాలాజీ తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా బలమైన ఎమోషన్స్ తో కూడిన కథను నేటితరం ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్దినట్లు దర్శకనిర్మాతలు చెబుతున్నారు.

చిత్రంలో చూపించే ప్రతి సన్నివేశం కూడా సగటు ప్రేక్షకుడి మదిలో ఎప్పటికీ నిలిచిపోతుందని.. అన్ని వర్గాల ఆడియన్స్ కెనెక్ట్ అయ్యేలా ఈ మూవీ రూపొందించామన్నారు. ఈ సినిమాలో రెజీనా రోల్.. ఓ ఆంగ్లో ఇండియన్ టీచర్ గా విలక్షణ పాత్రలో నటిస్తున్నట్లు పేర్కొన్నారు. అనసూయ మరో పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఇద్దరి రోల్స్‌తో పాటు ప్రభుదేవా క్యారెక్టర్ కూడా కొత్తగా ఉంటుందన్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందకు తీసుకొస్తామన్నారు.