Anasuya: రాజకీయాలలోకి ప్రముఖ యాంకర్ అనసూయ… వైరల్ అవుతున్న వేణుస్వామి కామెంట్స్!

0
40

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరమవుతూ వెండి తెర సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ క్షణం పాటు తీరిక లేకుండా ఎంతో బిజీగా ఉన్నటువంటి అనసూయ గురించి తాజాగా ఒక వార్త వైరల్ అవుతుంది.

ప్రముఖ సెలబ్రిటీల జాతకాలను చెబుతూ వార్తల్లో నిలిచే జ్యోతిష్యులు వేణు స్వామి గతంలో అనసూయ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈయన అనసూయ జాతకం గురించి చెబుతూ మాట్లాడినటువంటి వ్యాఖ్యలను కనుక గమనిస్తే ఈమె త్వరలోనే రాజకీయాలలోకి కూడా రాబోతుందని తెలుస్తోంది. మరి అనసూయ గురించి వేణు స్వామి ఏం చెప్పారు అనే విషయానికి వస్తే…

ఈ సందర్భంగా వేణు స్వామి అనసూయ జాతకం గురించి మాట్లాడుతూ 2021 వ సంవత్సరం తర్వాత అనసూయ క్రేజ్ భారీగా పెరిగిపోతుందని తెలిపారు.ఆమెను ఇండస్ట్రీలో ఆపడం ఎవరి తరం కాదని ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకు ఉంటుందని తెలియజేశారు. ఇలా ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఈమె రాజకీయాలలోకి వచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయని వేణు స్వామి తెలియచేశారు.

Anasuya: రాజకీయాలలోకి రంగమ్మత్త…


ఈ విధంగా వేణు స్వామి అనసూయ జాతకం గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ నిజమే అవుతున్నాయని తెలుస్తోంది 2020 వరకు అనసూయ బుల్లితెర యాంకర్ గా మాత్రమే ఉండేవారు. ఆ తర్వాత వెండితెర సినిమా అవకాశాలను అందుకొని ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు ఇలా ఈయన చెప్పిన మాటలు నిజమే అవుతున్నాయని అయితే త్వరలోనే రాజకీయాలలోకి వచ్చిన ఆశ్చర్య పోవాల్సిన పనిలేదని పలువురు ఈ వ్యాఖ్యలపై కామెంట్స్ చేస్తున్నారు.