Anasuya: అల్లు అర్జున్ హీరో ఏంటి… మెగా ఫ్యామిలీని గెలికిన అనసూయ… ఫైర్ అవుతున్న బన్నీ ఫాన్స్!

0
157

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఓ వెలుగు వెలిగినటువంటి అనసూయ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతూ వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా గట్టిగా పలు సినిమా అవకాశాలను అందుకున్నటువంటి అనసూయ పలు వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా కూడా వార్తల్లో నిలుస్తుంటారు. ఇలా వివాదాల ద్వారా తరచూ వార్తల్లో ఉండే అనసూయ మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ పై చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అనసూయ పలువురు సెలబ్రిటీలపై తన స్టైల్ లో విమర్శలు కురిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ గురించి గతంలో చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ హీరోగా నటించిన గంగోత్రి సినిమా గురించి అనసూయ మాట్లాడుతూ పలు విమర్శలు చేశారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్స్ గురించి అప్పట్లో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే అనసూయ కూడా బన్నీపై ట్రోల్స్ చేశారు.

అల్లు అర్జున్ హీరో ఏంటి అంటూ కామెంట్ చేశారు. ఇక ఈ సినిమాలో ఒక పాటలు అల్లు అర్జున్ అమ్మాయి పాత్రలో నటిస్తారు. అసలు ఆ పాట తాను చూడలేకపోయాను అంటూ ఈమె విమర్శలు చేశారు.అంతేకాకుండా మెగా ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఎంత మెగా ఫ్యామిలీ అయితే మాత్రం అల్లు అర్జున్ స్టార్ హీరోగా మారుతారా అంటూ గతంలో చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Anasuya: విమర్శించిన హీరో సినిమాలోని నటిస్తున్న అనసూయ..

ఇలా అనసూయ మెగా ఫ్యామిలీ గురించి అల్లు అర్జున్ గురించి ఇలాంటి కామెంట్స్ చేయడంతో అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. ఆరోజు అల్లు అర్జున్ గురించి కామెంట్ చేసిన అనసూయ నేడు ఆయన సినిమాలోనే పలు పాత్రలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో హీరోగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈయన పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.