ఇటీవల యాంకర్ అనసూయ ఎవరో తనకు తెలియదని.. ఆమె వేసుకునే వస్త్రధారణపై ‘మా’ ఎన్నికల నేపథ్యంలో సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు కామెంట్స్ చేసిన నేపథ్యంలో అనసూయ భరద్వాజ్ ట్విట్టర్ వేదికగా ఆయన పేరు చెప్పకుండా తప్పు పడుతూ ట్వీట్ చేశారు. కోటి శ్రీనివాసరావు ఓ యూ ట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను మాట్లాడారు.

తెలుగు ఇండస్ట్రీలోని కొందరు నటులు, షోలపై విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా జబర్దస్త్ షోను టార్గెట్ చేసి.. ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్‌పై ఈయన కామెంట్స్ చేశాడు. అనసూయ మంచి డ్యాన్సరే కాకుండా అద్భుతమైన నటి కూడా.. ఆ అమ్మాయి చేసిన సినిమాలు కూడా నేను చూసాను.. కానీ ఆమె వేసుకునే బట్టలు మాత్రం తనకు నచ్చవని కామెంట్ చేసాడు కోట.

అనసూయ లాంటి అందమైన అమ్మాయి ఎలా ఉన్నా జనాలు చూస్తారు.. ఆమె అలాంటి చిట్టి పొట్టి బట్టలు వేసుకోవాల్సిన అవసరం లేదు.. ఆమె ఎంత మంచి నటి అయినా కూడా తన డ్రెస్సింగ్ నాకు నచ్చదని చెప్పాడు కోట. ఆ కార్యక్రమంలో జడ్జిగా వ్యవహరిస్తున్నా రోజా ఎంత పద్ధతిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు కోట. ఈ విషయంపై అనసూయ భరద్వాజ్ స్పందించారు. కోట శ్రీనివాసరావు పేరుని ప్రస్తావించకుండా ఆయన తీరుని ట్విట్టర్ వేదికగా విమర్శించారు.

తన వస్త్రధారణ గురించి ఆయన మాట్లాడారు. అలాంటి అనుభవమున్న వ్యక్తి అలా నీచంగా మాట్లాడటం అనేది నాకు చాలా దుఃఖాన్ని కలిగించిందని వాపోయింది. ఒకరు ధరించే దుస్తులు వారి వ్యక్తిగతం అని ఘాటుగా సమాధానం ఇచ్చింది. తన పైన కామెంట్ చేసిన ఆ సీనియర్ నటుడు.. సినిమాలలో స్త్రీలను కించపరిచిన సన్నివేశాలు ఎన్నో ఉననాయని.. వారిని సోషల్ మీడియా ఎందుకు పట్టించుకోదో.. నాకు అర్థం కాదన్నారు. ఏదేమైనా అనసూయ వ్యాఖ్యలు.. కోట వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.































