Anchor Anasuya, Indraja : జబర్దస్త్… తెలుగు బుల్లితెర మీద రికార్డులు క్రియేట్ చేసిన షో. దీని గురించి తెలియని ప్రేక్షకులు వుండరు. ఈ ప్రోగ్రాం ద్వారా ఎంతోమంది నటీ నటులు ఇండస్ట్రీకి పరిచయం అయినారు. ప్రోగ్రాం మొదలు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకూ టాప్ రేటెడ్ ప్రోగ్రాములలో ఒకటిగా కొనాసాగుతోంది. అయితే గత కొంత కాలంగా జబర్దస్త్ కాస్త కళ తప్పినట్టుగా కనిపిస్తోంది. చాలా మంది కమెడియన్లు ఒకరి తరువాత ఒకరు వెళ్లిపోతున్నారు. కొన్ని రోజుల నుండి అనసూయ కూడా జబర్దస్త్ వీడనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇంతకు ముందే అనసూయ ఇంస్టాగ్రామ్ ద్వారా తాను జబర్దస్త్ వీడుతున్న విషయం తెలియజేసింది. ఇక ఇపుడు జబర్దస్త్ నిర్వాహకులు కూడా దీన్ని షో ద్వారా చెప్పేసారు. ప్రస్తుతం దీనికి సంబందించిన ప్రోమో వైరల్ అవుతోంది.

కన్నీరు పెట్టుకున్న ఇంద్రజ…
తాజాగా వచ్చిన ప్రమోలో అందరూ అనసూయకు వీడ్కోలు చెప్పారు. ఇంద్రజ ఎమోషనల్ అయ్యి స్టేజ్ మీద అనసూయని పట్టుకుని కన్నీరు పెట్టుకున్నారు. జబర్దస్త్ షో మిమ్మల్ని ఖచ్చితంగా మిస్ అవుతుంది అని చెప్పారు. ప్రోగ్రాంలో భాగంగానే చాలాకి చంటి తన స్కిట్ లో అనసూయ కి ఇదే ఆఖరి ఎపిసోడ్ అని చెప్పేసాడు. ఇక తాగుబోతు రమేష్ అనసూయ గెటప్ తో స్కిట్ చేసి అందరి చేత కన్నీరు పెట్టించాడు. చంటి పిల్లలు వున్నా కూడా అనసూయ జవర్దస్త్ కోసం చాలా కస్టపడింది అని చెప్పుకోచ్చాడు.

జబర్దస్త్ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది, ఇకపై కూడా ఇస్తూనే ఉంటుంది. ఈ షోకి ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారూ జబర్దస్త్ మాత్రం పర్మినెంట్ గా ఇక్కడే ఉంటుంది అంటూ అందరు ముక్త కంఠంతో చెప్పుకొచ్చారు. అనసూయకి యాంకర్ గా జబర్దస్త్ ఎంత క్రేజ్ తెచ్చిపెట్టిందో అందరికి తెలిసిందే. కెరీర్ సక్సెస్ అవ్వడానికి జబర్దస్త్ తో వచ్చిన క్రేజ్ కారణం అని అనడం అతిషయోక్తి లేదు. ప్రస్తుతం అనసూయ వెళ్లిపోతుంటే ఇంద్రజ ఎమోషనల్ అయ్యి కన్నీరు పెట్టుకున్న ఈ ప్రోమో వైరల్ అవుతోంది.































