Anchor Lasya: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో యాంకర్ లాస్య ఒకరు.చీమ ఏనుగు జోక్స్ తో ఎంతో ఫేమస్ అయినటువంటి లాస్య బుల్లితెరపై పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.ఇలా బుల్లితెర కార్యక్రమాలలో కొనసాగుతూనే ఈమె మంజునాథ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

ఇలా పెళ్లి తర్వాత కూడా ఈమె పలు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూ వచ్చారు. అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. బిగ్ బాస్ తర్వాత ఈమె సొంతంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.
ఇకపోతే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే లాస్య తన వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తిపరమైన విషయాలను కూడా అందరితో పంచుకుంటారు. ఇక తాజాగా తన భర్త మంజునాథ్ మార్చి 16వ తేదీ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ క్రమంలోనే తన భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈమె ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

Anchor Lasya: భార్యగా గర్వపడుతున్నా….
లాస్య తన భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ… హ్యాపీ బర్త్‌డే మై డియర్ మంజునాథ్.. నా భర్త గురించి నేను ఎంతో గర్వపడుతున్నా. పర్ఫెక్ట్ హస్బెండ్. నా పిచ్చితనాన్ని క్షమించే ఏకైన వ్యక్తివి నువ్వు. నన్ను నవ్వించావు.. నన్ను భరిస్తూనే కన్నీళ్లు తుడిచావు.. దగ్గరుండి నా సక్సెస్ నా వైఫల్యాలను కూడా చూసావు. ప్రతి ఒక్క సమయంలోను నాకు అండగా ఉంటూ నన్ను ప్రోత్సహించావు. నన్ను ఎంతో బలంగా మార్చావు. నా సంతోషానికి కారణం నువ్వే. ఓ పర్‌పెక్ట్ హస్బెండ్‌కు భార్యగా గర్వపడుతున్నాను లవ్ యు అంటూ ఈమె చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
































