Anchor Syamala: నూతన గృహ ప్రవేశం చేసిన యాంకర్ శ్యామల.. వీడియో వైరల్!

0
767

Anchor Syamala: బుల్లితెరపై సుమ తరువాత మంచి గుర్తింపు సంపాదించుకున్న యాంకర్లలో యాంకర్ శ్యామల గురించి అందరికీ సుపరిచితమే.ఈమె కెరీర్ మొదట్లో పలు సీరియల్స్లో నటించడమే కాకుండా పలు చిత్రాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేశారు.ఇలా బుల్లితెరపై పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్యామల ఇదే గుర్తింపు బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చారు.

Anchor Syamala: నూతన గృహ ప్రవేశం చేసిన యాంకర్ శ్యామల.. వీడియో వైరల్!
Anchor Syamala: నూతన గృహ ప్రవేశం చేసిన యాంకర్ శ్యామల.. వీడియో వైరల్!

ఇలా బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీ దక్కించుకున్న ఈమె పలు సినిమా ఈవెంట్లు, బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తూ బాగానే సంపాదిస్తున్నారని చెప్పాలి. గత కొద్ది రోజుల క్రితం యాంకర్ శ్యామల నూతన ఇంటిని నిర్మించి గృహప్రవేశం చేసిన విషయం మనకు తెలిసిందే.

Anchor Syamala: నూతన గృహ ప్రవేశం చేసిన యాంకర్ శ్యామల.. వీడియో వైరల్!
Anchor Syamala: నూతన గృహ ప్రవేశం చేసిన యాంకర్ శ్యామల.. వీడియో వైరల్!

ఈ క్రమంలోనే ఈ గృహ ప్రవేశానికి సంబంధించిన ఒక వీడియోని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేశారు. ఈ వీడియోలో శ్యామల ఇల్లు మొత్తం పాలరాతితో నిర్మితమయి అచ్చం ఇంద్ర భవనాని తలపించేలా ఉందని చెప్పవచ్చు. అలాగే హోమ్ టూర్ కూడా చేసి తన ఇంటి మొత్తం చూపించారు.

గృహ ప్రవేశానికి హాజరైన సెలబ్రిటీలు..

తాజాగా నూతన గృహ ప్రవేశానికి సంబంధించిన వీడియోని శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేయడంతో ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ వీడియో చూసిన ఎంతో మంది నెటిజన్లు శుభాకాంక్షలు తెలపగా, మరికొందరు మాత్రం ఇతరుల నుంచి డబ్బులు కొట్టేసి ఇలాంటి విల్లాను కట్టారా అంటూ కామెంట్లు చేస్తున్నారు.గతంలో శ్యామల భర్త నర్సింహారెడ్డి ఒక మహిళ దగ్గర కోటి రూపాయలు తీసుకొని తనకు ఇవ్వకుండా ఉండడంతో సదరు మహిళ కేసు వేసిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ వీడియోలో భాగంగా శ్యామల గృహప్రవేశానికి యాంకర్ సుమ దంపతులు, గీత మాధురి, తనీష్, పలువురు సీరియల్ సెలబ్రిటీలు కూడా హాజరైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.