Anchor Suma: అమ్మా నేను నిన్ను చూడను తల్లి… సుమకు కౌంటర్ ఇచ్చిన ఎన్టీఆర్… వీడియో వైరల్!

0
171

Anchor Suma: యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాంకర్ సుమ గురించి గతకొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం మనకు తెలిసిందే ఎన్టీఆర్ యాంకర్ సుమపై సీరియస్ కావడంతో సుమ బోరున ఏడ్చారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ తన అన్నయ్య కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అమిగోస్ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన ఎన్టీఆర్ ను ఉద్దేశిస్తూ సుమా మాట్లాడారు. ఈ క్రమంలోనే సుమ మాట్లాడుతూ… అభిమానులందరూ కూడా ఎన్టీఆర్ 30 కోసం ఎదురుచూస్తున్నారు అయితే ఈ సినిమా అప్డేట్ ఇవ్వాల్సిందిగా ఎన్టీఆర్ ని కోరుతున్నాము అంటూ చెప్పడంతో ఒక్కసారిగా ఎన్టీఆర్ సుమ వంక సీరియస్ గా చూశారు.ఇలా చూడటమే కాకుండా వాళ్ళు అడగకపోయినా నువ్వే చెప్పేలాగా ఉన్నావు అంటూ సీరియస్ అయ్యారు.

ఇలా ఈ ఘటనకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఈ విషయంపై సుమకు ఎన్టీఆర్ ఫన్నీ కౌంటర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. తాజాగా ఈయన విశ్వక్ హీరోగా నటించిన సినిమా వేడుకలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమ అందరిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఎన్టీఆర్ గురించి కూడా మాట్లాడారు.

Anchor Suma: ఒక్కసారి చూడు తారక్…


ఇలా ఎన్టీఆర్ గురించి చెప్పగానే ఎన్టీఆర్ వేదిక కింద కూర్చొని తనని చూడను అంటూ సైగలు చేశారు. ఇలా ఎన్టీఆర్ సుమ వంక చూడను అంటూ సైగలు చేస్తూ ఉండగా సుమ మాత్రం వేదికపై నుంచి ఒక్కసారి చూడు తారక్ అంటూ మాట్లాడారు.ఇలా తన వంక చూస్తే మరో ఎలాంటి వార్తలను క్రియేట్ చేస్తారో అన్న ఉద్దేశంతో ఇలా చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.