Anchor Suma: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ సుమ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బుల్లితెర పై పలు షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూ తన మాటలతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది. అంతేకాకుండా యాంకర్ లలో నెంబర్ వన్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బుల్లితెరపై మకుటంలేని మహారాణిగా దూసుకుపోతోంది. అయితే కేవలం బుల్లితెరపై ప్రసారమయ్యే షోలకు మాత్రమే కాకుండా ఏ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన, ఆడియో ఫంక్షన్స్ జరిగినా అందులో సుమ కనకాల మాటలే వినిపిస్తూ ఉంటాయి.

సుమ తన మాటలతో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంటుంది. కాకపోతే ఇది ఇలా ఉంటే సుమ కనకాల లీడ్ రోల్ లో నటించిన తాజా చిత్రం జయమ్మ పంచాయతీ. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులలో మంచి క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే యాంకర్ సుమ అభిమానులు ఈ సినిమాపై బాగానే అంచనాలు పెట్టుకున్నారు. అంతేకాకుండా ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సుమ జయమ్మ అనే పాత్రలో అద్భుతంగా నటించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో సుమ డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే మొదటి నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ చివర్లో మాత్రం సుమ బూతు డైలాగ్ చెప్పడంతో ప్రేక్షకులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
అంచనాలు పెంచిన ట్రైలర్…
ఇకపోతే చాలాకాలం తర్వాత సుమ మళ్ళీ సినిమాల లోకి రీ ఎంట్రీ ఇవ్వడమే కాకుండా ఎంట్రీలోనే తాను ప్రధానపాత్రలో నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. ఈ సినిమాకు విజయ్ కుమార్ దర్శకత్వం వహించారు. అలాగే బలగా ప్రకాష్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా మే 6న థియేటర్లలో విడుదల కానుంది. ఇక విడుదల తేది దగ్గర పడుతుండటంతో సుమ ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉంది.


































