దేశంలో కరోనా మహమ్మారి సామాన్యులతో పాటు సెలబ్రిటీలను కూడా భయపెడుతోందనే సంగతి తెలిసిందే. ఈరోజు స్టార్ హీరో చిరంజీవికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో టాలీవుడ్ సినీ ప్రముఖులను కరోనా భయం వెంటాడుతోంది. తాజాగా స్టార్ యాంకర్ సుమ కరోనా పరీక్ష చేయించుకున్నారు. సుమ బిగ్ బాస్ షోకు హాజరు కావడంతో కరోనా టెస్ట్ చేయించుకున్నారు.

ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. రాజమౌళి, బండ్ల గణేష్, తమన్నా కరోనా బారిన పడి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. చిరంజీవికి కరోనా నిర్ధారణ కావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నాగార్జున, సీఎం కేసీఆర్, రామ్ చరణ్, కొరటాల శివ, రాజమౌళి మరికొందరు రాజకీయ, సినీ ప్రముఖులు రాజమౌళికి సన్నిహితంగా మెలిగారని సమాచారం.

దీంతో వాళ్లందరూ కరోనా పరీక్షలకు చేయించుకోవడానికి సిద్ధమవుతున్నారు. అయితే యాంకర్ సుమ బిగ్ బాస్ షోకు వెళ్లకముందు కరోనా పరీక్ష చేయించుకోగా మారిన పరిస్థితుల నేపథ్యంలో మరోసారి కరోనా పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. నాగార్జున రెండు రోజుల క్రితం చిరంజీవితో పాటు సీఎం కేసీఆర్ ను కలిశారు. ఆ సమయంలో అక్కడ చిరంజీవి, నాగార్జున , కేసీఆర్ మాస్కులు ధరించలేదు.

దీంతో నాగార్జునకు కరోనా సోకుతుందేమోనని బిగ్ బాస్ టీంకు సైతం టెన్షన్ పట్టుకుంది. సుమ తాను కరోనా పరీక్ష చేయించుకున్న వీడియోను షేర్ చేస్తూ తాను బిగ్ బాస్ షోకు వెళ్లిన తరువాత ఏం జరిగిందో అందరికీ తెలుసని వెళ్లకముందు ఏం జరిగిందో చూడండంతూ వీడియోతో ట్వీట్ చేసింది. ఆ పరీక్షల్లో నెగిటివ్ రావడంతో ఆమె బిగ్ బాస్ షోకు హాజరయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here