Anchor Suma:యాంకర్ సుమ ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లో ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా తన వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తే సందడి చేస్తున్నారు. ఇలా సుమా తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లడం చేతనే ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆది పురష్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు దూరంగా ఉన్నారు.

ఈ విధంగా ఈ సినిమా ఈవెంట్ సుమ యాంకర్ గా లేకపోవడంతో యాంకర్ ఝాన్సీ ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించారు.ఇక సుమ ఈ కార్యక్రమంలో కనిపించకపోవడంతో పలువురు సుమ ఎందుకు రాలేదు అంటూ ఆమెను ప్రశ్నించారు. అయితే ఆమె తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లో ఉన్నాను అంటూ చెప్పుకొచ్చారు. వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తున్న ఈమె గాయాలు పాలైనటువంటి ఒక ఫోటోని కూడా షేర్ చేశారు.

Anchor Suma: కాలి వేళ్ళకు గాయాలు….
ఈ వెకేషన్ లో భాగంగా ఎక్కువగా షూ వేసుకోవడంతో తన కాళ్ల వేళ్లకు మొత్తం గాయాలు అయ్యాయని ట్రీట్మెంట్ చేయించుకుని ప్లాస్టర్ వేసుకున్నటువంటి ఫోటోలను ఈమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఈ ఫోటోలు పై స్పందించిన ప్రభాస్ అభిమానులు ఆది పురుష్ ఫ్రీ రిలీజ్ వేడుకకు లేకపోవడంతో రామయ్య ఆగ్రహం చెందాడని అందుకే మీకు ఇలా అయింది అంటూ కామెంట్లో చేస్తున్నారు.
































