Anchor Suma: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సుమా కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు గత కొన్ని సంవత్సరాలుగా యాంకర్ గా ఇండస్ట్రీలో చెరగని ముద్ర సంపాదించుకున్న సుమకు ఇద్దరు పిల్లలు అనే విషయం మనకు తెలిసిందే. అయితే సుమ కుమారుడు రోషన్ ఇదివరకే నిర్మల కాన్వెంట్ సినిమా ద్వారా వెండి తెరపై సందడి చేశారు.

ఇలా ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను సందడి చేసిన రోషన్ ఉన్నత చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్లారు. అయితే తన చదువులు పూర్తి చేసుకున్నటువంటి ఈయన హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే నేడు రోషన్ పుట్టినరోజు కావడంతో సుమ సోషల్ మీడియా వేదికగా తన కుమారుడి సినిమాకు సంబంధించిన పోస్టర్ నుషేర్ చేస్తూ అసలు విషయాన్ని వెల్లడించారు.
ఈ క్రమంలోనే అడవి శేషు హీరోగా నటించిన క్షణం, కృష్ణ అండ్ హిస్ లీల సినిమాలతో మంచి హిట్స్ అందుకున్నటువంటి డైరెక్టర్ రవికాంత్ పెరేపు ఈ మూవీకి దర్శకత్వం వహించబోతున్నాడు. ఇక ఈ సినిమాకు కథను కూడా ఆయనే సమకూర్చారు. ఇక ఈ సినిమాకి తన మునుపటి సినిమాలకు పని చేసిన మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పకల సంగీత దర్శకుడిగా వ్యవహరించబోతున్నారు.

Anchor Suma:హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న రోషన్…
రోషన్ పుట్టినరోజు సందర్భంగా ప్రొడక్షన్ నెంబర్ వన్ అంటూ ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదల చేయగా ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ఇతర తారాగణం గురించి పూర్తి వివరాలు వెల్లడించునున్నట్లు తెలుస్తోంది.ఇదివరకే రెండు సూపర్ హిట్ సినిమాలను అందుకున్న డైరెక్టర్ రవికాంత్ మూడో సినిమాతో కూడా మరో హిట్ అందుకోబోతున్నారా, ఈ సినిమా రోషన్ కి మంచి సక్సెస్ అందిస్తుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.































