Anchor Suma: టాలివుడ్ ఇండస్ట్రీలో లేడి యాంకర్ అనగానే అందరికీ మొదటగా గుర్తొచ్చే పేరు సుమ. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ స్టార్ యాంకర్స్ గా గుర్తింపు పొందిన సుమ ఇప్పటికీ నంబర్ వన్ యాంకర్ గానే కొనసాగుతోంది. ఇండస్ట్రీలో ఎంత మంది కొత్త యాంకర్లు వచ్చినా కూడా సుమకి పోటీగా నిలవలేకపోతున్నారు. అందుకు కారణం సున యాంకరింగ్ చేసే విధానం.

తన మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ అందరిని నవ్వించే సుమ యాంకరింగ్ అంటే చాలా ఇష్టం. ఇలా టెలివిజన్ లో ప్రసారం అవుతున్న టీవీ షోలో మాత్రమే కాకుండా సినిమా ఫ్రీ రిలీజ్ లో కూడా సుమ సందడి చేస్తూ బిజీగా ఉంటుంది. ప్రస్తుతం సుమ ఈటీవీలో ప్రసారమవుతున్న క్యాష్ షోలో మాత్రమే యాంకర్ గా వ్యవహరిస్తోంది.
ఇక సుమ యాంకర్ గా సరికొత్త టీవీ షో తొందరలోనే ప్రారంభం కాబోతోంది. ‘ సుమ అడ్డా ‘ అనే పేరుతో ప్రారంభం కానున్న ఈ షో జనవరి 7వ తేదీ నుండి ప్రసారం కానుంది. ఇక తాజాగా ఈ షో కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ ప్రోమోలో కళ్యాణం కమనీయం సినిమా బృందం హాజరయ్యారు. హీరో సంతోష్ శోభన్, హీరోయిన్ ప్రియా భవాని శంకర్ లతో పాటు దర్శకుడు కూడా ఈ షో కి హాజరయ్యాడు. ఇక వీరితో సుమ చేసిన సందడి మామూలుగా లేదు.

Anchor Suma: సన్నీ లియోన్ కి మెసేజ్ చేసిన సంతోష్ శోభన్….
ఈ షో ప్రారంభమైనప్పటి నుంచి సుమ తన ప్రశ్నలతో పలు టాస్కులతో చాలా సందడి చేసింది. ఇక చివరలో హీరో సంతోష్ శోభన్ మొబైల్ తీసుకొని అతని వాట్సాప్ చాట్ లీక్ చేసింది. సంతోష్ వాట్సాప్ లో అనుపమతో చేసిన చాటింగ్ ని అందరిముందూ బయట పెట్టింది. అంతే కాకుండా సంతోష్ సన్నీ లియోన్ కి మెసేజులు పెట్టి వాటిని ఎవరూ చూడకుండా డిలీట్ చేసిన విషయం కూడా అందరి ముందు లీక్ చేయడం విశేషం. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
































