Anchor Suma:తెలుగు బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో యాంకర్ సుమ ఒకరు.ఈమె కెరియర్ మొదట్లో పలు సినిమాలలో నటించారు అనంతరం బుల్లితెర సీరియల్స్ లో నటించారు. అయితే ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా ఏ సినిమా వేడుక జరిగిన కూడా అక్కడ తప్పకుండా సుమ యాంకరింగ్ చేయాల్సిందే. ఈ విధంగా సుమా కెరియర్ పరంగా వారంలో ఏడు రోజులపాటు ఏమాత్రం తీరిక లేకుండా వరుస కార్యక్రమాలలో ఎంతో బిజీగా గడుపుతూ ఉంటారు..

ఇక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా సుమ చాలా యాక్టివ్ గా ఉంటూ ఎన్నో రకాల వీడియోస్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈమెకు ఎంతోమంది హీరోలు బెస్ట్ ఫ్రెండ్స్ గా కూడా మారిపోయారు. ఇలా సుమకు బెస్ట్ ఫ్రెండ్స్ అయినటువంటి వారిలో నాచురల్ స్టార్ నాని ఒకరు అయితే ఒక రోజు సరదాగా నాని సుమకు ఫోన్ చేసి అర్ధరాత్రి సమయంలో తనని ఆటపట్టించారట అయితే రాజీవ్ కనకాల మాత్రం నానికి దిమ్మతిరిగే వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది.
ప్రస్తుతం సుమ నానికి సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఏం జరిగింది అనే విషయానికి వస్తే.. ఒకరోజు అర్ధరాత్రి సమయంలో నాని సరదాగా సుమను ఆటో పట్టించడం కోసం తనకు ఫోన్ చేసి మా సినిమాలో మిమ్మల్ని హీరోయిన్గా తీసుకోవాలనుకుంటున్నాము. మీరు అయితే కరెక్ట్ గా సరిపోతారు. అయితే మీకు ఏమాత్రం ఇవ్వలేమని ఫ్రీ సర్వీస్ చేయాలి అంటూ మాట్లాడారట.

Anchor Suma: సుమకు ఫోన్ చేసి ఆట పట్టించిన నాని…
తనని గుర్తుపట్టకుండా కొంచెం వాయిస్ మార్చి నాని మాట్లాడటంతో సుమా ఫోన్ తీసుకెళ్లి తన భర్తకు ఇచ్చారట.అయితే నాని అని గుర్తు పట్టనటువంటి రాజీవ్ ముందు నోరు మూసుకొని ఫోన్ పెట్టు బే అంటూ తనకు వార్నింగ్ ఇచ్చారు అని తెలుస్తుంది.దెబ్బకు నాని ఫోన్ పెట్టేయడమే కాకుండా మరలా ఫోన్ చేసి తానే ఫోన్ చేశానని సరదాగా చేశానని చెప్పడంతో మేము కూడా సరదాగా రిప్లై ఇచ్చామని సుమ దంపతులు చెప్పారట. ప్రస్తుతం వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.