సోషల్ మీడియాలోని నెటిజన్లు, బుల్లితెర ప్రేక్షకులను యాంకర్ విష్ణుప్రియ ఎలా కట్టిపడేస్తుంటుందో అందరికీ తెలిసిందే. వెండితెరపై హీరోయిన్‌గానూ విష్ణుప్రియ నటించారు. విచ్చలవిడి అందాల ఆరబోతతో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ఇటీవల ఆమె ఇన్ స్టాలో అప్ లోడ్ చేసిన మాట్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

యాంకర్ విష్ణు ప్రియ నెమ్మదిగా సినిమాలపై ఫోకస్ పెడుతుంది. టీవీ షోస్‌తో యాంకర్‌గా రచ్చ చేసిన ఈ హాట్ అందాల భామ ఇప్పుడు డిజిటల్ మీడియాలో హంగామా చేసేందుకు రెడీ అవుతుంది. గ్లామర్ షో విషయంలో విష్ణు ప్రియ ఏనాడు వెనకాడుగు వేయలేదు. సాధ్యమైనంత వరకు తన అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది.

తెలుగు, తమిళం, కన్నడ వంటి భాషలలో నటించిన విష్ణు ప్రియ తెలుగులో పోవే పోరా అనే షోతో యాంకర్‌గా అడుగుపెట్టింది. విష్ణు ప్రియ యూట్యూబ్ యాక్టర్ గా కెరీర్ మొదలుపెట్టి, బుల్లితెర యాంకర్ గా మారింది. వెండితెరపై హీరోయిన్ గా వెలిగిపోవాలనే ప్రయత్నాలలో ఉన్నారు. తాజాగా ది బేకర్ అండ్ ది బ్యూటీ చిత్రంలో కూడా నటించింది.

1987 ఫిబ్రవరి 22 న హైదరాబాద్ లో జన్మించింది ఈ అమ్మడు. ఆమె ఒక్క షోకి రూ.50 నుంచి రూ.70 వేల వరకు తీసుకుంటుందంటూ టాక్. అయితే ఆమె ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే. వాళ్ల తండ్రి వ్యాపారవేత్తగా ఉన్నారు. ఆమెకు మణికొండ దగ్గర కోటిన్నర విలువ చేసే ఫ్లాట్ తో మొత్తం ఆమె ఆస్తులు రూ. 5కోట్ల వరకు ఉంటుందని సినీ వర్గాల టాక్. అంతే కాకుండా ఆమెకు విలువైన కార్లు కూడా ఉన్నాయి.































