మనం చిన్నతనం నుంచి పెద్దలు ఓ మాట చెబుతూ ఉంటారు.. అదేంటంటే.. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి తలదూర్చకూడదని.. అలా చేస్తే.. చివరకు నష్టపోయేది మూడో వ్యక్తే. కానీ ఇక్కడ అతడికి ఈ విషయం తెలుసో.. లేక తెలిసే వాళ్లిద్దరి గొడవ మధ్యలో తల దూర్చాడో తెలియదు కానీ.. పాపం ప్రాణాలను కోల్పోయాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

గుంటూరు జిల్లాలోని మంగళదాస్‌నగర్ లో 2వ లైను చెందిన గోగులపాటి బెన్ని తన భార్యను తాగి వచ్చి ఎప్పుడూ వేధిస్తుండేవాడు. తాగి వచ్చి తన భార్యను విపరీతంగా.. ఎక్కడ పడితే అక్కడ కొడుతుంటాడు. ఇలా ఓ రోజు తాగుడు బంద్ చేయండంటూ తన భార్య నిలదీసింది. దీంతో తీవ్రంగా కోపం తెచ్చుకున్న అతడు ఆమెను ఇంకా ఎక్కువగా కొట్టడం మొదలు పెట్టాడు.
ఆ గొడవ అతి పెద్దదిగా తయారైంది. దీంతో ఆ గొడవను సరిదిద్దేందుకు ఇంటి పక్కనే ఉన్న శ్యాంసన, పక్కనే ఉన్న ఏచూరి సత్యనారాయణ(48)లు అక్కడకు వెళ్లారు. బెన్నీకి ఒక కుమారుడు జాన ఉన్నాడు. ఈ గొడవ జరుగుతుండగా అతడు అక్కడే ఉండి చూస్తున్నాడు. దీంతో గొడవ మధ్యలోకి వచ్చిన వాళ్లిద్దరిని అతడు తీవ్రంగా దూషించాడు. మా కుంటుం గొడవలోకి మీరెందుకు వచ్చారంటూ.. వాళ్లను తిట్టాడు. తల్లిదండ్రులు కొట్టుకుంటుంటే.. బొమ్మలా నిలబడి చూస్తున్నావా అంటూ వాళ్లు అతడిని నిలదీశారు.
దీంతో అతడికి కోపం వచ్చింది. ఇంట్లోకి వెళ్లి.. కత్తి పట్టుకొని వచ్చి క్షణికావేశంలో సత్యనారాయణను అతికిరాతంగా పొడిచాడు. దీంతో అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతడు అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని జానను అదుపులోకి తీసుకున్నారు.































