Anirudh Ravichandran: వామ్మో ఒక్క సినిమాకు అనిరుద్ తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

0
47

Anirudh Ravichandran: అనిరుద్ రవిచంద్రన్ ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈ పేరు మారుమోగిపోతుంది. యువ సంగీత దర్శకుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన తెలుగు తమిళ భాషలలో స్టార్ హీరోలు అందరి సినిమాకు అద్భుతమైన బిజిఎం ఇస్తూ స్టార్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా డైరెక్టర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమాకు కూడా ఈయన సంగీతం అందించారు.

ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. ఇక రజనీకాంత్ జైలర్ సినిమా కూడా మంచి సక్సెస్ కావడంతో ఈయన వద్దకు వెళ్లే దర్శక నిర్మాతల సంఖ్య కూడా పెరిగిపోయింది. ఏమాత్రం తీరిక లేకుండా వరుస సినిమాలకు కమిట్ అయినటువంటి ఈయన కోసం లేట్ అయిన ఎదురుచూస్తాము అనే ధోరణిలో దర్శక నిర్మాతలు ఉన్నారు.ఇక ప్రస్తుతం ఈయన ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం దేవర సినిమాకు సంగీతం అందిస్తున్నారు. అదేవిధంగా షారుఖ్ ఖాన్ అట్లీ దర్శకత్వంలో నటించిన జవాన్ సినిమాకి కూడా అనిరుధ్ సంగీతం అందించారు.

Anirudh Ravichandran: కోట్లలో రెమ్యూనరేషన్…


ఇలా రెండు భారీ బడ్జెట్ సినిమాల ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మరికొన్ని సినిమాలు కూడా షూటింగ్ పనులను జరుపుకుంటున్నాయి.ఇలా క్షణం పాటు తీరిక లేకుండా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి అనిరుద్ ఒక్కో సినిమాకు భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఈయన ఒక్కో సినిమాకు సుమారు 8 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇలా 35 సంవత్సరాల వయసులోని ఈయన ఒక్కో సినిమాకు 8 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకోవడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.