Annapurnamma : తెలుగు ఇండస్ట్రీ లో తల్లి పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రెస్ అన్నపూర్ణమ్మ. 700 కి పైగా సినిమాల్లో నటించిన అన్నపూర్ణమ్మ అసలు పేరు ఉమా మహేశ్వరి. నాటకాల ద్వారా మంచి పేరు సంపాదించుకున్న ఆమె దాసరి నారాయణరావు గారి సినిమా ‘స్వర్గం నరకం’ లో మోహన్ బాబు సరసన మొదరి సారి హీరోయిన్ గా నటించారు. ఆ తరువాత కూడా హీరోయిన్ గా అవకాశాలు వచ్చినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిమితమైంది. అటు సినిమాల్లో అడపాదడపా చేస్తూనే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, వంటి షోలలో కామెడీ తో ఆకట్టుకుంటున్న అన్నపూర్ణమ్మ గారు ఇటీవలే క్యాష్ షోలో సందడి చేసారు.

రామ్ చరణ్ ను కరివేపాకుల తీసేసింది…
షోలో సుమ కామెడీకి అన్నపూర్ణమ్మ, శివ పార్వతి, వై విజయ వంటి ఆర్టిస్టుల టైమింగ్ షో ఆధ్యంతం బాగా నవ్వుకున్నారు ప్రేక్షకులు. అయితే షోలో పైసా వసూలు రౌండ్ లో భాగంగా అన్నపూర్ణమ్మకు సుమ ప్రశ్నలు అడిగింది. అయితే దానికి సమాధానాలు చెప్పడం ఇష్టం లేకపోతే బెలూన్ ఉది దాన్ని పగులగొట్టాలి తక్కువ సమయంలో, ఇక అన్నపుర్ణమ్మ ప్రయత్నించినా బెలూన్ పగలలేదు.

దీంతో ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో ఇద్దరి నటనలో ఎవరి నటన చూసినపుడు గర్వంగా అనిపించింది అంటూ ఎన్టీఆర్, రామ్ చరణ్ గురించి అడుగగా అన్నపూర్ణమ్మ ఎన్టీఆర్ అని చెప్పింది. మరి రామ్ చరణ్ అని సుమ అడిగితే ఉంటాడు పక్కన అని చెప్పడంతో మెగా అభిమానులు కాస్త చిన్నబుచ్చుకున్నారు. నిజానికి ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటన చాలా బాగా ఉంటుంది. ఇద్దరు వారి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు.































