వకీల్ సాబ్ నుంచి మరో ఫోటో లీక్.. ‘అదిరిపోయే లుక్’లో పవన్ కళ్యాణ్, శృతి హాసన్!

0
355

సాధారణంగా కొత్త సినిమాను తెరకెక్కిస్తున్నప్పుడు దర్శకనిర్మాతలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ సినిమాకు సంబంధించి ఎటువంటి ఫోటోలు కానీ, వీడియోలు కానీ బయటకు తెలియనివ్వరు. అలా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న సినిమా విషయంలో మాత్రం సినిమాకు సంబంధించిన ఫోటోలు బయటకు విడుదల అవుతున్నాయి. అసలే పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.

తమ అభిమాన నటుడు నటించబోయే సినిమాలో ఎలా ఉంటుందోనని ఎంతో ఆతృతగా ఎదురు చూసే అభిమానులకు ఇలా ఫోటోలు లీక్ అవడంతో కొంతవరకు ఆనందంగానే ఉన్నా, చిత్ర బృందానికి మాత్రం ఎంతో ఇబ్బందిగా ఉందని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో వకీల్ సాబ్ చిత్రానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ ఫోటో లీక్ కావడంతో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ సంఘటన జరిగి కొద్దిరోజులు గడవకముందే మరొక ఫోటోలు లీక్ అవడంతో చిత్ర బృందం ఈ విషయంపై మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

తాజాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం వకీల్ సాబ్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో ఇది మూడవ సినిమా అని చెప్పవచ్చు. అయితే పవన్ కళ్యాణ్, శృతి హాసన్ ఒకరి చేయి ఒకరు పట్టుకొని ఉన్నటువంటి ఫోటో ప్రస్తుతం లీక్ అవడంతో, పాట చిత్రీకరణకు సంబంధించిన ఫోటో అని తెలుస్తోంది. హిందీలో మంచి విజయం సాధించిన “పింకీ” చిత్రానికి రీమేక్ గా “వకీల్ సాబ్” చిత్రాన్ని దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్నారు.ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు నిర్మాత దిల్ రాజు పేర్కొన్నారు. ఈ సినిమాకు సంగీతం ఎస్.ఎస్.తమన్ సమకూర్చనున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన “మగువా మగువా” అనే పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.