కరోనా రోగులకు మరో షాకింగ్ న్యూస్.. కొత్తగా ఆ సమస్యలు..?

0
240

ప్రపంచ దేశాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా కరోనా మహమ్మారి గజగజా వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి గురించి శాస్త్రవేత్తల పరిశోధనలు కొనసాగుతున్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు కరోనా మహమ్మారి గురించి మరో షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. ఈ వైరస్ నేరుగా గుండె కండరాలపై ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. వైరస్ గుండె పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపారు.

గతంలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయగా కరోనా వైరస్ శరీరంలోని ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుందని తేలింది. అయితే తాజాగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో మాత్రం ఊపిరితిత్తుల కంటే గుండెపైనే వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడైంది. వైరస్ గుండెపై దాడి చేయడం వల్లే గుండెలోని రక్తనాళాలు గడ్డ కట్టే అవకాశం ఉందని చికాగో శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. గుండెపై వైరస్ ప్రభావం చూపితే భవిష్యత్తులో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ఇప్పటికే శాస్త్రవేత్తలు కరోనా బారిన పడి చనిపోయిన వాళ్లలో గుండెలో రక్తం కడ్డ కట్టినట్టు గుర్తించారు. ఇప్పటికే హృదయ సంబంధిత వ్యాధులతో బాధ పడే వాళ్లు కరోనా బారిన పడితే మరింత ప్రమాదమని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. గతంలో ఎటువంటి హృదయ సంబంధిత సమస్యలు లేకపోయినా కరోనా సోకిన తరువాత ఆ సమస్యలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కరోనా బారిన పడ్డ 25 శాతం నుంచి 30 శాతం మంది రోగుల్లో ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కొందరికి గుండె కణజాలాల మధ్య ఇన్ఫెక్షన్ సోకినట్లు గుర్తించామని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here