Anu Emmanuel: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఎన్ని కోట్లు పెట్టి సినిమా చేసాం అన్నది కాకుండా ఆ సినిమాని ప్రేక్షకులలోకి ఎలా తీసుకెళ్తున్నారు అనేది ప్రధాన అంశంగా మారింది.ఈ క్రమంలోనే సినిమాని ప్రేక్షకులలోకి తీసుకెళ్లడానికి చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇలా ప్రమోషన్ కార్యక్రమాలలో కొన్నిసార్లు ఇబ్బందులను కూడా ఎదుర్కొంటున్నటువంటి హీరో హీరోయిన్లు ఉన్నారు.

ఈ క్రమంలోనే చాలా కాలం తర్వాత అల్లు శిరీష్ నటిస్తున్న ఊర్వశివో రాక్షసివో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి జరుపుకొని కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ నవంబర్ 4వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు అను ఇమ్మానుయేల్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు.
ఈ సందర్భంగా విలేఖరి ప్రశ్నిస్తూ మీరు అల్లు అర్జున్ హీరోగా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలో నటించారు. ఇప్పుడు అల్లు శిరీష్ తో కలిసే నటించారు. ఇద్దరిలో ఏ హీరోతో మీకు కన్వీనెంట్ గా ఉంది అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ ఇలాంటివి తప్ప మీ దగ్గర ప్రశ్నలు ఉండవా అంటూ తనదైన శైలిలో రిపోర్టర్ కి దిమ్మతిరిగే సమాధానం చెప్పారు.

Anu Emmanuel: బాయ్ కాట్ ఇమ్మానుయేల్..
ఈ క్రమంలోనే ఈ విషయంపై అల్లు అర్జున్ అభిమానులు స్పందిస్తూ అల్లు శిరీష్ కన్నా అల్లు అర్జున్ ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు. అల్లు అర్జున్ పేరు చెప్పి ఉంటేనీ లైఫ్ ఎక్కడికో వెళ్ళిపోయి ఉండేది నీలాంటి హెడ్ వెయిట్ ఉన్నటువంటి హీరోయిన్లు ఇండస్ట్రీకి అవసరం లేదు అంటూ బన్నీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున మండి పడటమే కాకుండా,బాయ్ కాట్ ఇమ్మానుయేల్ అనే హాష్ ట్యాగ్ ని ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు . దీంతో ఈ హీరోయిన్ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది.



























