Raviteja: రవితేజ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈగల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కావాల్సిందిగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇక ఫిబ్రవరి 9వ తేదీ ఈ సినిమా విడుదల కానుంది.

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం ఇటీవల ఒక రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు . ఇంటర్వ్యూలో భాగంగా రవితేజ అనుపమ పరమేశ్వరన్ నవదీప్ అవసరాల శ్రీనివాస్ వంటి తదితరులు పాల్గొన్నారు.
తాజాగా ఇంటర్వ్యూకి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ డైరెక్టర్ ను పట్టుకొని కార్తీక్ అన్నయ్య అంటూ మాట్లాడారు. దీంతో వెంటనే రవితేజ అందమైన అమ్మాయిలు బేసిగ్గా ఒక పదం వాడకూడదు. ఎప్పుడూ కూడా అన్నయ్య అనే పదం వాడకూడదని నేను ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోమని చెప్పారు.
అన్నయ్య అని పిలవకూడదు..
తనతో కలిసి నేను నాలుగు సినిమాలు చేశాను తనతో నాకు మంచి ర్యాపో ఉంది. అందుకే అన్నయ్య అని పిలుస్తున్నాను అంటూ అనుపమ చెప్పగా వెంటనే అవసరాల శ్రీనివాస్ మేము మూడు సినిమాలు చేసి నీతో సినిమాలు చేయడం మానేస్తాను అంటూ కామెంట్స్ చేశారు. ఇలా అన్నయ్య అనే పదం వాడకూడదు అంటూ రవితేజ ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.































