Anushka: ప్రభాస్ వద్దని వారించిన వినకుండా అనుష్క నటించిన ఆ అట్టర్ ప్లాప్ సినిమా ఏమిటో తెలుసా..?

0
55

Anushka: సూపర్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన అందాల నటి అనుష్క శెట్టి ఆ తర్వాత నటించిన విక్రమార్కుడు సినిమా ద్వారా హీరోయిన్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. అలాగే అనుష్క నటించిన అరుంధతి సినిమా ఆమె సినీ కెరీర్ ని మలుపు తిప్పింది. ఆ సినిమాతో అనుష్క స్టార్ హీరోయిన్ జాబితాలోకి చేరిపోయింది. ఇక అప్పటినుండి తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో స్టార్ హీరోల సరసన నటిస్తూ అనుష్క సందడి చేసింది. ఇక రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి సినిమాతో అనుష్క పాన్ ఇండియా హీరోయిన్గా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

అనుష్క- ప్రభాస్ జోడి చాలా చూడముచ్చటగా ఉంటుంది. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలన్ని కూడా మంచి హిట్ అందుకున్నాయి. అందువల్ల వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు గతంలో ఎన్నో వార్తలు కూడా వినిపించాయి. అయితే వారిద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా ప్రభాస్ తో స్నేహం కోసం సినిమాలనే వదిలేస్తానని అనుష్క ఒక టీవీ షోలో చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ గా కూడా మారాయి. ఇంత క్లోజ్ గా ఉన్న వీరి ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటారు.అలాగే సినిమాల విషయంలో కూడా ఒకరికొకరు సహాయం చేసుకునేవారు.

Anushka:ప్రభాస్ మాట వినని అనుష్క..


ఈ క్రమంలో అనుష్కని ఒక సినిమాలో ఒక సినిమాలో నటించవద్దని ప్రభాస్ వారించినా కూడా ఆమె వినకుండా ఆ సినిమాలో నటించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ సినిమా ఏమిటో కాదు అల్లు అర్జున్, మంచు మనోజ్ కలిసి నటించిన వేదం. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అనుష్క ఒక వేశ్య పాత్రలో నటించింది . ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మంచి మంచి అవకాశాలు అందుకుంటున్న సమయంలో అనుష్క అలాంటి పాత్రలో నటిస్తానని చెప్పినప్పుడు ప్రభాస్ వద్దని వారించాడు. అలాంటి పాత్రలలో నటిస్తే తనకున్న ఇమేజ్ పాడవుతుందని చెప్పినా కూడా అనుష్కకి ఆ పాత్ర నచ్చటంతో వేదం సినిమాలో నటించినట్లు తెలుస్తోంది.