టాలీవుడ్ ఇండస్ట్రీలో అనుష్క శెట్టి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన. అనుష్కకు మరొక పేరు స్వీటి అనే సంగతి మనకు తెలిసిందే. పేరుకు తగ్గట్టుగానే ఆమె ప్రవర్తన మాటతీరు ఇతర పట్ల చూపే ప్రేమానురాగాలు కూడా ఎంతో స్వీట్ గా ఉంటాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న ఈ విపత్కర పరిస్థితులను గురించి తాజాగా అనుష్క ప్రజలందరిలో ధైర్యం నింపేలా ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఈ విపత్కర పరిస్థితులలో ఎంతో మందికి సరైన సమయంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. రోజుకు లక్షల సంఖ్యలో కేసులు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే ప్రజలలో ఉన్న భయాన్ని తొలగించి వారికి ధైర్యం నింపడానికి జేజమ్మ తనదైన శైలిలో పోస్టు ద్వారా అందరికీ ధైర్యం నింపారు.

ఈ సందర్భంగా అనుష్క తెలియజేస్తూ… ఇప్పుడున్న ఈ కష్టకాలంలో ప్రతి ఒక్కరూ మంచిగా ఉన్నారనే భావిస్తున్న.. పోయిన వారిని ఎప్పటికీ తిరిగి తీసుకురాలేము, ఇలాంటి ఈ పరిస్థితులలో నుంచి బయటకు రావడానికి మనకు మనమే సహాయం చేసుకుంటూ పోవాలి.ప్రభుత్వం తెలియజేసిన నిబంధనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మనకు మనమే స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలి. మీ కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో ఎంతో సంతోషంగా మాట్లాడుతూ సంతోషంగా గడపండి. ఈ క్రమంలోనే శ్వాసకు సంబంధించిన కొన్ని వ్యాయామాలు చేయండి.

ప్రతిరోజు ఉదయం ఒక పాజిటివీటితో మొదలు పెట్టండి
జీవితంలో మనకు ఆ పాజిటివ్ ఎనర్జీయే అవసరం. మనకు చేతనైనంత సాయం చేయండి.. అది ప్రార్థనలు అయినా పర్లేదు.. మనం కష్ట కాలాన్ని ఎదుర్కొంటాం. ఎప్పుడు నెగిటివిటీ గురించి ఆలోచిస్తూ మనకున్న శక్తిని వృధా చేసుకోకూడదు అంటూ అనుష్క ఎంతో మంది లో ధైర్యం నింపింది. జేజమ్మ స్వీట్ గా చెప్పిన ధైర్యానికి ఎంతోమంది అభిమానులు ఫిదా అవుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here